ఈసారి బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు కావాల్సినన్ని గొడవలు పెట్టుకునేందుకు బంపరాఫర్ ఇచ్చాడు. ఇద్దరి కన్నా ఎక్కువ మందిని కూడా నామినేట్ చేసుకోవచ్చని తెలిపాడు. ఇద్దరిని నామినేట్ చేయడానికే కిందామీద పడుతున్న కంటెస్టెంట్లు ఈ ఆప్షన్ వాడదల్చుకోలేదు. కానీ మోనాల్, అరియానా మాత్రం ఈ అవకాశాన్ని చేజార్చుకోదల్చుకోలేదు. అయితే అరియానా వేరేవాళ్లతో మామూలుగా మాట్లాడి, మోనాల్‌తో మాత్రం గొంతు పెంచి డిమాండ్ చేసినట్లు మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వింది. మరోవైపు అవినాష్ గత ఎలిమినేషన్ నుంచి ఇప్పటికీ బయటకు రావడం లేదు. తనకన్నా వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు అని మోనాల్‌నుద్దేశిస్తూ పదేపదే దెప్పి పొడిచాడు. ఫలితంగా మరోసారి నామినేషన్‌లో వచ్చిపడ్డాడు. అటు హారిక, అభి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నా.. అర్థం చేసుకుని మళ్లీ కలిసిపోయారు. కానీ అఖిల్, మోనాల్ మాత్రం భగ్గుమంటూ ఎదురు పడటానికి కూడా ఇష్టపడలేదు.
అభిని నామినేట్ చేసి ఏడ్చేసిన హారిక
బిగ్‌బాస్ హౌస్‌లో 13 వారానికిగానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏడుగురు కంటెస్టెంట్ల ముందు కంటైనర్స్ ఉంటాయి. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కంటెస్టెంట్ల కంటైనర్లలో కలర్ నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఎవరి గిన్నెలో ఎక్కువ రంగు నీళ్లు ఉంటే వాళ్లు నామినేట్ అయినట్లు లెక్క. మొదటగా హారిక నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది. నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి నేను కారణం అయినప్పటికీ, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదనిపించిందని అవినాష్‌ను నామినేట్ చేసింది. నీకు విలువిచ్చాను. కాకపోతే నాకంటే వీక్ ఉన్నవాళ్లు నామినేషన్‌లో ఉన్నప్పుడు నేనెలా ఎలిమినేట్ అవుతాను అన్న సందేహమే నన్ను వేధిస్తోంది అని అవినాష్ స్పష్టం చేశాడు. అనంతరం టాస్కు ఆడటానికి నిరాకరించినందుకుగానూ అభిజిత్‌ను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించగానే అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. కన్ఫెషన్ రూమ్‌లో జరిగినదానికి అభిని నామినేట్ చేయలేదని అంతకుముందే ఇది అనుకున్నానని హారిక కెమెరాల ముందు చెప్పుకుంటూ ఏడ్చింది.
నీకు ఓవర్ కాన్ఫిడెంట్..
తర్వాత అవినాష్.. మోనాల్‌ను వీక్ అంటూ నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా మోనాల్ మాట్లాడుతూ నేను వీక్ కాదని జనాలు నిరూపించారు, అది మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది. దీంతో అవినాష్ అందుకుంటూ.. ఆమె వీక్ కాదని నిరూపించారట. 'అంటే నేను వీక్ కదా! ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్లే సేవ్ అయ్యాను కదా. అందుకే ముఖం చూపించుకోలేకపోతున్నా..' అని అవినాష్ ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత తనను వరస్ట్ కెప్టెన్ అని చెప్పినందుకు అఖిల్‌ను నామినేట్ చేశాడు. అనంతరం అఖిల్.. నీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఉందంటూ అవినాష్‌ను, గేమ్‌లో ఎఫర్ట్స్ తక్కువగా ఉన్నాయని మోనాల్‌ను నామినేట్ చేశాడు. (చదవండి: హారికను పెళ్లి చేసుకుంటా: అవినాష్)
నాకోసం స్టాండ్ తీసుకోవాల్సింది: అభి
అనంతరం అభిజిత్.. 'మొదటి రోజు నుంచీ నీవల్ల నేను ఎమోషనల్‌గా హర్ట్ అవుతున్నా. ఇది నీ తప్పు అనట్లేదు. కానీ నీకు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా కూడా నీ విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నువ్వు కావాలని చేస్తున్నావో, దేనికి చేస్తున్నావో తెలీదు కానీ ఎక్కడో ఓసారి నాకోసం నువ్వు స్టాండ్ తీసుకుంటే బాగుండేదనిపించింద'ని మోనాల్‌ను నామినేట్ చేశాడు. 'టాస్కు చేయకపోవడం నాకు తప్పు. కానీ ఎందుకు చేయలేదనే విషయం నీకు బాగా తెలుసు. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎవరూ అర్థం చేసుకోలేరు' అంటూ హారిక కంటైనర్‌లో అతి తక్కువ రంగు నీళ్లు పోసి నామినేట్ చేశాడు. (చదవండి: రంగంలోకి ‘ఆర్జీవీ’, వణికిపోయిన హౌస్‌మేట్స్)
ఆ ఇద్దరినీ తొలిసారి నామినేట్ చేసిన మోనాల్
తర్వాత వచ్చిన మోనాల్ తనను చులకనగా చూస్తున్న కంటెస్టెంట్లకు గట్టి కౌంటర్లు ఇచ్చింది. ముందుగా అవినాష్‌ను నామినేట్ చేస్తూ ఇక్కడున్న అందరూ స్ట్రాంగే అని నొక్కి చెప్పింది. నామినేషన్‌కు భయపడటమే మీ వీక్‌నెస్ అని చెప్పింది. తర్వాత టాస్క్ ఆడనందున అభిని నామినేట్ చేస్తూ.. మీరు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా మీకు దూరంగానే ఉంటున్నాను అని క్లారిటీ ఇచ్చింది. అలాగే తన క్లోజ్ ఫ్రెండ్ అఖిల్‌ను సైతం నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది, నువ్వు బ్రెయిన్‌తో గేమ్ ఆడితే, నేను మనసుతో ఆడతానని మోనాల్ తెలిపింది. నన్ను నామినేట్ చేయనని మాటిచ్చావు, కానీ చేస్తున్నావు అని అఖిల్ సీరియస్ అవగా నువ్వే కదా గేమ్ ఆడమన్నావు అంటూ ఆమె బదులిచ్చింది. అయినా సరే ఆమె మాటలను వినిపించుకోని అఖిల్.. నువ్వు ప్రతిరోజు నా కళ్లు తెరిపిస్తున్నావు అని మనసులోని బాధను కక్కేశాడు. ఇక హౌస్‌లోకి వెళ్లి మోనాల్ ఏడ్చేసింది. మొదటి మూడు వారాలు ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, పదే పదే నన్ను వీక్ అంటున్నారని హారికతో తన గోడు వెల్లబోసుకుంది.
ముగ్గురిని నామినేట్ చేసిన అరియానా
అరియానా.. తనను వరస్ట్ కెప్టెన్ అన్నందుకు హారిక, అవినాష్, సోహైల్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో అరియానా.. మోనాల్‌ను డిమాండ్ చేస్తూ మాట్లాడింది. మధ్యలో అందుకుని అవినాష్ తెలుగులో మాట్లాడు అని చెప్పగా మధ్యలో మాట్లాడకు అని మోనాల్ హెచ్చరించింది. సోహైల్.. అవినాష్‌ను నామినేట్ చేస్తూ మోనాల్ కూడా స్ట్రాంగ్ అయిందని, ఆమెను వీక్ అనొద్దని అభ్యర్థించాడు. మోనాల్ కన్నీళ్లు తుడిచాడు. ఈవారం అభిజిత్, అవినాష్, మోనాల్, అఖిల్, హారిక నామినేట్ అయ్యారు. (చదవండి: బిగ్‌బాస్ : తొలిసారి అభిజిత్ భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment