Mukku Avinash Engagement Photos: తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల అవినాష్ నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అవినాష్ తన ఇన్స్టాలో షేర్ చేశారు.
‘సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు. మా కుటుంబాలు కలుసుకున్నాయి.. తర్వాత మేము కలుసుకున్నాం. ఇది మా నిశ్చితార్థం. చాలా మంది చాలా సార్లు నా పెళ్లి గురించి అడిగారు. అతి త్వరలోనే నా అనూజతో పెళ్లి. ఎప్పటి లాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఓ పోస్టు పెట్టాడు అవినాష్.
ఇక అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం తెలియగానే.. అమ్మాయి ఎవరన్న విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ అమ్మాయి పూర్తి పేరు అనూజ వాకిటి. అవినాష్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయే తను. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment