
Mukku Avinash Haldi Function: టీవీ కమెడియన్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇంట పెళ్లి గంటలు మోగాయి. ఇటీవలె అనుజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ అతి మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత బిగ్‌బాస్ సీజన్ 4లో పెళ్లి పెళ్లి అంటూ కలవరించిన అవినాష్ ఎట్టకేలకు పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు.
ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. సోమవారం అవినాష్ స్వస్థలంలోనే హల్దీ ఫంక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు టీవీ నటులు సహా నెటిజన్ల నుంచి అవినాష్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.