మోనాల్ స్ట్రాంగ్‌: బాధ‌ను దిగ‌మింగిన‌ అవినాష్‌ | Bigg Boss 4 Telugu: Avinash Drops Bigg Bomb On Abhijeet | Sakshi
Sakshi News home page

అవినాష్ అవుట్‌: అభిజిత్‌పై బిగ్‌బాంబ్‌

Published Sun, Dec 6 2020 11:06 PM | Last Updated on Mon, Dec 7 2020 3:52 PM

Bigg Boss 4 Telugu: Avinash Drops Bigg Bomb On Abhijeet - Sakshi

బిగ్‌బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా ప‌ది కోట్ల ఐదు ల‌క్ష‌ల ఓట్లు వ‌చ్చాయ‌ని వ్యాఖ్యాత నాగార్జున వెల్ల‌డించారు. ప్ర‌తివారం పెరుగుతున్న ఈ ఓట్ల సంఖ్య‌ను చూస్తుంటే ఫైన‌ల్‌కు భీభ‌త్సంగానే ఓట్లు ప‌డేట్లు క‌నిపిస్తోంది. ఇక మోస్ట్ ఎంట‌ర్‌టైనర్ ఆఫ్ ద సీజ‌న్ బిరుదు అందుకున్న అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సంద‌ర్భంగా త‌ను ఎప్పుడూ వీక్ అని ప‌దేప‌దే నొక్కి చెప్పే మోనాల్‌ను తొలిసారి స్ట్రాంగ్ అని పేర్కొంటూ సెల‌వు తీసుకున్నాడు. మ‌న‌సులోని దుఃఖాన్ని లోప‌లే అణిచివేసి అంద‌రికీ న‌వ్వులు పంచి మ‌రీ నిష్క్ర‌మించాడు మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా ముందుకు సాగిందో చ‌దివేయండి..

సోహైల్‌ అంద‌రి బంధువు..
తొంభై రోజులుగా క‌లిసి ఉంటున్న‌ కంటెస్టెంట్లకు ఒక‌రి గురించి మ‌రొక‌రికి ఎంత తెలుసనేది ప‌రీక్షించేందుకు బిగ్‌బాస్ 'యారోంకా యార్' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఒక్కో కంటెస్టెంటును నిల్చోమ‌ని చెప్పి నాగ్ మూడు ప్ర‌శ్న‌లు అడుగుతారు. దానికి స‌ద‌రు కంటెస్టెంటుతో పాటు మిగ‌తా ఇంటి స‌భ్యులు కూడా సమాధాన‌మివ్వాల్సి ఉంటుంది. ఎవ‌రు క‌రెక్ట్‌గా చెప్తే వారికి గులాబీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఎక్కువ మంది గురించి స‌రైన జ‌వాబులు చెప్పిన సోహైల్‌కు ఎక్కువ‌ గులాబీలు రావ‌డంతో అత‌డు గెలిచాడు. ర‌న్న‌రప్‌గా నిలిచిన హారిక 'అంద‌రి బంధువ‌య' సాష్‌ను సోహైల్ భుజాన‌ వేసింది. (చ‌ద‌వండి: టాప్ 2: లాస్య జోస్యం నిజ‌మ‌య్యేనా?)

ఆవును ప‌ట్టుకుని గంగిరెద్దు అన్న అవినాష్‌
"టికెట్ టు ఫినాలే" టాస్క్‌లో అంద‌రినీ ముప్పుతిప్ప‌లు పెట్టించిన‌ ఆవు మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మైంది. అయితే ఈసారి ఒక‌రిని సేవ్ చేసేందుకే వ‌చ్చింద‌ని నాగ్ స్ప‌ష్టం చేశారు. దీంతో నామినేష‌న్‌లో ఉన్న ఇంటి స‌భ్యులు త‌మ‌ని కాపాడ‌మంటూ ఆవును వేడుకున్నారు. సంక్రాంతికి ఇంటికొచ్చి వెలుగునిస్తావు, నాకూ అలాగే వెలుగునివ్వు అంటూ అవినాష్‌ దానికి ముద్దు పెట్టి కాళ్లు ప‌ట్టుకున్నాడు. ఇది చూసిన నాగ్ సంక్రాంతికి ఆవు కాదు, గంగిరెద్దు వ‌స్తుంద‌ని కౌంట‌రిచ్చారు. దీంతో నాలుక్క‌రుచుకున్న అవినాష్‌.. క్ష‌మించు, న‌న్ను సేవ్ చెయ్యు అంటూ దాన్ని కాళ్లు ప‌ట్టుకున్నా అది క‌నిక‌రించ‌లేదు. ఎవ‌రి ప్ర‌య‌త్నాల‌కు చ‌లించ‌ని ఆ కామ‌ధేనువు అభిజిత్ అభ్య‌ర్థించ‌గానే అంబా అని అరిచి అత‌డిని సేవ్ చేసింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అప్పుడు రాహుల్‌, ఇప్పుడు అఖిల్‌!)

హుషారుగా జోడీ డ్యాన్సులు
త‌ర్వాత ఇంటిస‌భ్యులతో మ‌రో గేమ్ ఆడించారు. గార్డెన్ ఏరియాలో వీళ్లు త‌మ‌ ఎదురుగా ఉన్న ప్లే లిస్ట్ బోర్డ్స్‌కు బంతిని కొట్టాలి. ఏ ప్లే లిస్ట్‌కు బంతి త‌గిలితే ఆ పాట‌కు ఒక‌రిని సెల‌క్ట్ చేసుకుని డ్యాన్స్ చేయాలి. మొద‌ట హారిక‌.. ప్యూర్‌లీ ప్రేమ‌ను మోనాల్‌కు అంకితం చేసింది. అలా వీరిద్ద‌రూ క‌లిసి డ్యాన్స్ చేస్తూ ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌ర్వాత అఖిల్ ఎన‌ర్జీ బీట్స్ ప్లే బోర్డ్‌కు బంతి కొట్టడంతో 'గ్యాంగ్ లీడ‌ర్' సాంగ్‌కు సోహైల్‌తో క‌లిసి స్టెప్పులేశాడు. సోహైల్ టాలీవుడ్ హంక్స్‌ను సెల‌క్ట్ చేసుకోగా రావ‌ణా.. జైజైజైజై.. సాంగ్‌కు రాక్ష‌సంగా డ్యాన్స్ చేశారు. అరియానా దోస్తు మేరా దోస్త్ ప్లే బోర్డ్‌ను ఎంపిక చేసుకుని అవినాష్‌తో చిందేసింది. అవినాష్ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న.. పాట‌కు అరియానాను ఎత్తుకుని మ‌రీ రొమాన్స్ చేశాడు. అభిజిత్ పార్టీ టైమ్ అంటూ సోహైల్‌తో చిందులేశాడు. మోనాల్ మాత్రం అఖిల్‌, హారిక ఇద్ద‌రి‌తో క‌లిసి డ్యాన్స్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది.

అఖిల్ ప్రేమ చాలా కావాలి: మోనాల్‌
ఈ సంద‌ర్భంగా అఖ‌ల్ ల‌వ్ ఎక్కువ కావాలి అని మోనాల్ ఆనందంతో మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్పేయ‌డంతో అఖిల్‌ ఆమెను రెప్ప వేయ‌కుండా చూస్తూ ఉండిపోయాడు. రొమాన్స్ జోన‌ర్‌లో అభితో డ్యాన్స్ చేయాల‌నుంద‌ని హారిక మ‌న‌సులోని మాట‌ను చెప్ప‌గా ఆమె కోసం స్పెష‌ల్ సాంగ్ వేయించ‌డంతో అభిక జోడీ క‌లిసి డ్యాన్స్ చేశారు. త‌ర్వాత హారిక సేవ్ అయిన‌ట్లు నాగ్ వెల్ల‌డించ‌గా ఆమె ఆనందంతో ఉబ్బిత‌బ్బిబైంది. అనంత‌రం మోనాల్ సేవ్ అవ‌గా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఊహించని ట్విస్టుల‌తో అభిజిత్ కంట నీరు)

ఏడుస్తున్న అరియానాను న‌వ్వించి..
అత‌డు బిగ్‌బాస్ హౌస్‌కు పాదాభివంద‌నం చేసి అంద‌రి ద‌గ్గ‌రా వీడ్కోలు తీసుకున్నాడు. మోనాల్ స్ట్రాంగ్ అని చెప్తూ క‌న్నీళ్ల‌ను దిగ‌మింగుకున్నాడు. అనంత‌రం స్టేజీ మీద‌కు వ‌చ్చిన అత‌డు అంద‌రి మీద మిమిక్రీ చేసి న‌వ్వించారు. కానీ క‌న్నీళ్లు పెట్టుకుంటున్న‌ అరియానాను మాత్రం నవ్వించ‌లేక‌పోయాడు. నీకోసం ఎదురు చూస్తుంటాన‌ని, ఏడ‌వొద్ద‌ని ఆమెను ఊర‌డించాడు. అరియానాను న‌వ్వించాల్సిందేన‌ని నాగ్ ప‌ట్టుప‌ట్ట‌డంతో ఆమెను ఇమిటేట్ చేసి ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చాడు. అనంత‌రం వారం రోజులు ఏ ప‌నీ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న బిగ్‌బాంబ్‌ను అవినాష్‌ అభిజిత్ మీద వేశాడు. (చ‌ద‌వండి: అఖిల్‌కు ఫినాలే మెడ‌ల్ వేసిన సోహైల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/7

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement