వీడియోతో అడ్డంగా దొరికిపోయిన‌ మోనాల్‌ | Bigg Boss 4 Telugu: Nag Shows Videos That Monal Kicked Avinash | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: నిజంగానే మోనాల్ త‌న్నింది

Published Sat, Dec 5 2020 11:01 PM | Last Updated on Sun, Dec 6 2020 9:32 AM

Bigg Boss 4 Telugu: Nag Shows Videos That Monal Kicked Avinash - Sakshi

ఇన్నాళ్లూ బిగ్‌బాస్ హౌస్‌లో అవినాషే పులిహోర క‌లుపుతాడ‌ని తెలుసు. కానీ అఖిల్ కూడా పులిహోర క‌లుపుతున్నాడ‌ని అరియానా మాట‌ల‌తో బ‌య‌ట‌ప‌డింది. సోహైల్ చేసిన త్యాగం వ‌ల్లే అఖిల్‌కు ఫినాలే మెడ‌ల్ వ‌చ్చింద‌ని నాగ్ మ‌రీమ‌రీ నొక్కి చెప్పారు. సోహైల్‌ను ఎమోష‌న‌ల్ ఫూల్‌గా అభివ‌ర్ణించారు మ‌రోవైపు వారం రోజులుగా చ‌ర్చ‌నీయాంశ‌మైన మోనాల్‌, అవినాష్ పంచాయితీ ఓ కొలిక్కి వ‌చ్చింది. మోనాల్ నిజంగానే త‌న్నింద‌ని నాగార్జున వీడియోతో స‌హా బ‌య‌ట‌పెట్ట‌డంతో ఆమె దోషిగా త‌ల‌దించుకుని అవినాష్‌కు సారీ చెప్పింది. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో తెలియాలంటే దీన్ని చ‌దివేయండి..

అవినాష్ వైఖ‌రితో త‌ల బాదుకున్న అరియానా
ఉన్న‌దున్న‌ట్లు చెప్పే అరియానా అఖిల్ బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టింది.. అఖిల్ త‌న‌ను పెళ్లి చేసుకుంటా అన్న‌ట్లుగా మాట్లాడాడ‌ని మోనాల్‌, సోహైల్‌తో చెప్పింది, బ‌య‌ట‌కు వెళ్లాక ట‌చ్‌లో ఉందామ‌‌ని చెప్పాడ‌ని అఖిల్‌ గుట్టు విప్పింది. త‌ర్వాత ఇంట్లో ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్కు జ‌రిగింది. ఇందులో అభిజిత్‌ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకోగా అఖిల్ అత‌డికి దారి చెప్తూ కింద ఉన్న ఐట‌మ్స్ తీసుకునేందుకు సహ‌క‌రించాడు. ఈ క్ర‌మంలో ఓ చోట అభి స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర దెబ్బ‌లు త‌గిలించుకున్నాడు. అరియానా స‌ర‌దాగా మాట్లాడిన‌దానికి అవినాష్ సీరియ‌స్ అయ్యాడు. చిన్న‌చిన్న‌వాటికే పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడ‌‌ని ఆమె త‌ల బాదుకుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయ‌ల్‌)

అవినాష్‌కు మ‌రోసారి సారీ చెప్పిన మోనాల్‌
నాగార్జున క‌నిపించ‌గానే కంటెస్టెంట్లు మ‌న‌సులోని బాధ‌నంతా బ‌య‌ట‌కు క‌క్కారు. మొద‌ట‌గా అవినాష్ క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుతూ‌.. ఆవు-అంబా టాస్కులో మోనాల్ త‌న‌ను కావాల‌ని త‌న్నింద‌ని చెప్పాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించి అంద‌రి అభిప్రాయాల‌ను అడిగి తెలుసుకున్నాడు. మోనాల్ కావాల‌ని త‌న్నింద‌ని అఖిల్ త‌ప్ప మిగ‌తా అంద‌రూ ఒప్పుకున్నారు. వీడియోలో మోనాల్ త‌న్నిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుండ‌గా ఆ స‌మ‌యంలో అవినాష్‌ను చూసి న‌వ్వ‌డం ఎవ‌రికీ మింగుడు ప‌డ‌లేదు. దీంతో త‌న త‌ప్పు తెలుసుకున్న మోనాల్ అవినాష్‌ను మ‌రోసారి క్ష‌మాప‌ణ‌లు కోరింది. కొంద‌రు వ్య‌క్తిగ‌తంగా ఆడ‌లేద‌ని అవినాష్ ఫిర్యాదు చేయ‌గా నాగ్ మాత్రం స‌పోర్ట్ తీసుకుని ఆడ‌టం త‌ప్పేమీ కాద‌ని క్లారిటీ ఇచ్చాడు.(చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఈ వారం అవినాష్ త‌ప్పించుకోలేడా?)

అఖిల్‌కు ఫినాలే మెడ‌ల్ వేసిన సోహైల్‌
త‌ర్వాత మోనాల్ మాట్లాడుతూ.. మూడు వారాలుగా నేను వీక్ నేను వీక్ అంటున్నారు. న‌న్ను ఎలా నిరూపించుకోవాలని ఏడ్చేసింది. ఇక త‌న్న‌డం గురించి కూడా ఆమె త‌న వివ‌ర‌ణ ఇచ్చుకుంటుండ‌గా.. క్యాన్ త‌న్నే క్ర‌మంలో అవినాష్‌ను త‌న్నావు అంతే.. అంటూ నాగ్ ఆమెను ఓదార్చారు. సోహైల్ త్యాగం వ‌ల్లే అఖిల్ గెలిచాడ‌న్న‌ది ప్రేక్ష‌కుల‌కు తెలుస‌ని నాగ్ చెప్పారు. త‌ర్వాత అఖిల్ సేవ్ అయ్యి ఫ‌స్ట్ ఫైన‌లిస్టుగా నిలిచాడ‌ని నాగ్ వెల్ల‌డించారు. అనంత‌రం సోహైల్ చేతుల మీదుగా అఖిల్ ఫినాలే మెడ‌ల్ వేయించుకున్నాడు.

మోనాల్ వ‌ల్ల గేమ్ డిస్ట‌ర్బ్ అవుతోంది..
ఆట‌లో మిమ్మ‌ల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న బంధ‌మేదో చెప్పి స్టిక్ విర‌గ్గొట్టాల‌ని నాగ్ ఆదేశించారు. గేమ్ మీద ఎఫెక్ట్ అయ్యేంత బాండ్ ఎవ‌రితోనూ లేద‌ని చెప్తూనే  అరియానా..  సోహైల్ పేరు చెప్పి స్టిక్ విరగ్గొట్టింది. న‌న్ను ఇబ్బంది పెడుతోందంటూ అభిజిత్.. హారిక పేరు చెప్పి స్టిక్ ముక్క‌లు చేశాడు. హారిక.. మోనాల్ ఒక‌రి పేర్లు మ‌రొక‌రు చెప్తూ స్టిక్ విర‌గ్గొట్టారు. అవినాష్ త‌న‌కు అంద‌రూ అడ్డేనంటూ స్టిక్‌ను ఆరు ముక్క‌లు చేసి అంద‌రికీ పంచాడు. మోనాల్ వ‌ల్ల గేమ్ డిస్ట‌ర్బ్ అవుతోంద‌ని అఖిల్ ఆమెతో బంధాన్ని బ్రేక్ చేశాడు. ఎవ‌రేడ్చినా త‌న‌కే బాధేస్తోంద‌ని చెప్పిన‌ సోహైల్‌ను నాగ్ ఎమోష‌న‌ల్ ఫూల్ అని పిలిచారు. సోహైల్ కూడా స్టిక్ విర‌గ్గొట్టి అంద‌రికీ ఆ ముక్క‌లు పంచాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ ఫినాలే రేస్‌: అత‌డే విజేత‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement