ఇంకోసారి ఫిగ‌ర్లు అంటూ తిరిగావో: నాగ్ వార్నింగ్‌ | Bigg Boss 4 Telugu: Nagarjuna Warns Avinash | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: అభిజిత్ తిక్క కుదిర్చిన‌ నాగ్‌

Published Sun, Nov 15 2020 3:44 PM | Last Updated on Sun, Nov 15 2020 10:25 PM

Bigg Boss 4 Telugu: Nagarjuna Warns Avinash - Sakshi

వ‌య‌సు అనేది కేవ‌లం ఒక నంబ‌ర్ అని నిరూపించేవారిలో మ‌న్మ‌థుడు నాగార్జున ముందు వ‌రుస‌లో ఉంటారు. నిత్య‌ య‌వ్వ‌నంగానే క‌నిపించే ఆయ‌న ఇప్ప‌టికీ ఎంతోమంది అమ్మాయిల మ‌న‌సుల్లో గ్రీకువీరుడిగా నిలిచిపోయారు. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ‌. నాగ్ కూడా త‌న మ‌ద్ద‌తు ఎప్పుడూ ఆడ‌వాళ్ల‌కే అని వారికే స‌పోర్ట్ చేస్తుంటారు. కాగా సండేను ఫండే చేసేందుకు నాగ్ కంక‌ణం క‌ట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోని ఇంటిస‌భ్యుల‌తో వెరైటీ గేమ్ ఆడించారు. అందులో భాగంగా కంటెస్టెంట్లు కొంద‌రు గ‌ద్ద‌ల్లాగా మారిపోగా మ‌రికొంద‌రు కుందేలు లేదా ప‌క్షుల్లాగా అవ‌తార‌మెత్తిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌ద్ద‌లు మిగ‌తా జంతువుల‌ను వేటాడిన‌ట్లు తెలుస్తోంది. ఇక అభిజిత్ నాకో తిక్కుంది, దానికో లెక్కుంది అంటూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ డైలాగ్ చెప్ప‌డంతో నీ తిక్క తెలుసులే అని నాగ్ కౌంట‌రిచ్చారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : నీకు పడిపోతా అవినాష్‌.. అరియానా)

మ‌రో గేమ్‌లో కంటెస్టెంట్లు ఒక్కొక్క‌రుగా డ్రాయింగ్ వేస్తుంటే మిగిలిన‌వారు దాన్ని ఆధారంగా చేసుకుని సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో అవినాష్.. హారిక గీసిన బొమ్మ‌ను చూసి సినిమా పేరును క‌రెక్ట్‌గా ఊహించి చెప్పాడు. దీంతో సంతోషం ప‌ట్ట‌లేక గెంతులు వేశాడు. ఒక్క‌డివే ఎందుకు? అంద‌మైన‌ భామ‌ల‌ను తీసుకుని డ్యాన్స్ చెయ్ అన‌గానే మోనాల్‌, హారిక‌, అరియానాతో స్టెప్పులేశాడు. ఇది చూసిన నాగ్ లాస్యను వ‌దిలేశావు క‌దూ అంటూ ఆంటీ టాపిక్‌ను మ‌రోసారి ప్ర‌వ‌ర్తించాడు. ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగ‌ర్లు అంటూ తిరిగావో.. అని నాగ్ ఏదో గ‌ట్టి వార్నింగే ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. స‌మ‌యం దొరికింది క‌దా అని హారిక ఏకంగా అవినాష్ మీద నీళ్లు గుమ్మ‌రించింది. దీంతో ఒక మ‌గాడికి అన్యాయం జ‌రుగుతుంటే సాటి మ‌గాడిగా సాయం చేయండి అవినాష్ అభ్య‌ర్థించాడు. అయితే తానెప్పుడూ ఆడ‌వాళ్ల‌కే సాయం చేస్తాన‌ని నాగ్‌ తేల్చి చెప్పారు. (చ‌ద‌వండి: నువ్వు ఫేక్‌, ఇది నీ ఎథిక్స్: అఖిల్ ఫైర్‌‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement