
కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్టుతో రాబోతున్న చిత్రం 'పైసా పరమాత్మ'. సాంకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిరణ్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ కాగా ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని మార్చి 12 న విడుదల సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత టి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. "పూర్తిగా స్టోరీని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది. దర్శకుడు కథ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సినిమా చేశాడు. అయన మీద నమ్మకంతోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాము.. ఈ చిత్రానికి మొదటినుంచి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా సినిమా పోస్టర్లను ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించిన రాజ్ కందుకూరి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరు సినిమాను ఆదరించండి" అని అన్నారు. బ్యానర్ : లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్, మ్యూజిక్ : కనిష్క్, దర్శకుడు : విజయ్ కిరణ్ తిరుమల, నిర్మాత : టి.కిరణ్ కుమార్
చదవండి: పిచ్చెక్కిపోయింది, నేను ఆ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు: అషూ
Comments
Please login to add a commentAdd a comment