అవినాష్ భార్యపై పృథ్వీ చీప్ కామెంట్స్.. మరీ ఇలానా? | Bigg Boss 8 Telugu Day 44 Promo Avinash Prithvi | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Promo: ఇదేనా నీ సంస్కారం? పృథ్వీకి అవినాష్ వార్నింగ్

Published Tue, Oct 15 2024 3:59 PM | Last Updated on Tue, Oct 15 2024 4:45 PM

Bigg Boss 8 Telugu Day 44 Promo Avinash Prithvi

బిగ్‌బాస్ 8 షో మరీ హద్దులు దాటేస్తున్నట్లు కనిపిస్తుంది. మాట్లాడుకోవడం, తన్నుకోవడం అనేది గేమ్స్ వరకు అయితే పర్లేదు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. మంగళవారం ఎపిసోడ్‌లో అలాంటి గొడవే జరిగింది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఫ్రెండ్‌షిప్ అనే పదాన్ని తీసి మరీ తనని బాధపెట్టారని యష్మి ఏడ్చింది. దీంతో ప్రేరణ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక గ్రూప్‌గా ఫామ్ అయిన నిఖిల్.. నబీల్, పృథ్వీ, మణికంఠతో మాట్లాడుతూ తేజని ఎలాగైనా సరే టార్గెట్ చేయాలని అన్నాడు. గుర్రం సౌండ్ వినిపించగానే యష్మి టోపీ లాగేసుకుని ప్రేరణకి ఇచ్చింది. పోడియంపై నిలబడ్డ విష్ణుప్రియ.. రివేంజ్ పేరుతో నయని పావనిని నామినేట్ చేయాలనుకుంది. కానీ రివేంజ్ అనేది ఇక్కడ కుదరదని బిగ్‌బాస్ అల్టిమేటం ఇచ్చేశాడు. ఇదంతా చూసిన తేజ.. ఓజీ క్లాన్ బండారాన్ని బయటపెట్టాడు. తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. ఓజీ vs తేజ చేసేస్తున్నారని, ఇక మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతా అని తేజ.. వాళ్లకు సవాలు విసిరాడు.

(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)

తర్వాత వచ్చిన పృథ్వీ.. ప్రోమో చూసి తను టాస్క్‌లు ఆడుతున్నానని చెప్పడం అస్సలు నచ్చలేదని అవినాష్‌ని నామినేట్ చేశాడు. దీంత ఇద్దరి మధ్య తగువు మొదలైంది. 'నేను చూసిన ఎపిసోడ్స్‌లో రెండు మూడు టాస్క్‌లు తప్పితే ఎక్కడా కనిపించలేదు. మా వైఫ్ చూసింది' అని అవినాష్ అనగానే.. మరి అలాంటిప్పుడు మీ భార్యనే బిగ్‌బాస్‌కి రావాల్సింది, మీరెందుకు వచ్చారు అని పృథ్వీ నోరు జారాడు. వైఫ్ టాపిక్ తీయకు అని అవినాష్ సీరియస్ అయ్యాడు.

సోఫాలు కూర్చోవడం తప్పితే ఇంకేం చేయవ్ అని అవినాష్ అనేసరికి.. కామెడీ తప్ప ఇంకేం చేశావ్ నువ్వు అని పృథ్వీ అన్నాడు. పోయిన వారం నేను ఏ పాయింట్ చెప్పానో, ఈ వారం కూడా గంగవ్వ అదే పాయింట్ చెప్పిందని అవినాష్ అనేసరికి.. 'గంగవ్వ పేరు ఎందుకు చెబుతావ్ రా' అని పృథ్వీ మరోసారి నోరు జారాడు. 'రేయ్ రా అనకు' అని అవినాష్ వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇది నీ సంస్కారం. బిగ్‌బాస్‌కి వచ్చావ్ కదా నేర్చుకో' అవినాష్-పృథ్వీ ఒకరిపై ఒకరు వెళ్లారు.

(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement