'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత | Samantha Citadel Trailer Telugu Latest | Sakshi
Sakshi News home page

Samantha Citadel: ట్రైలర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన సమంత

Published Tue, Oct 15 2024 1:57 PM | Last Updated on Tue, Oct 15 2024 2:46 PM

Samantha Citadel Trailer Telugu Latest

సమంత సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. చివరగా 'ఖుషి' మూవీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా యాక్టింగ్ కొన్నాళ్లు పక్కనబెట్టేసింది. కొత్త మూవీస్ కూడా పెద్దగా ఒప్పుకోలేదు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకులు.. 'సిటాడెల్: హనీ-బన్నీ' పేరుతో ఓ సిరీస్ తీస్తున్నారు. ఇందులో సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్‌ ఇంటర్వెల్‌లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్‌)

ట్రైలర్ చూస్తే సిరీస్ అంతా ఫుల్ యాక్షన్ ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది. ఇందులో సమంత ఓ సీక్రెట్ ఏజెంట్. ఈమెకు ఓ కూతురు కూడా ఉంటుంది. మరోవైపు వరుణ్ కూడా సీక్రెట్ ఏజెంట్. వీళ్లిద్దరూ ఎలా కలిశారు? ఏ మిషన్స్ పూర్తి చేశారు అనేదే స్టోరీ అని తెలుస్తోంది. ట్రైలర్‌లోనే ఫుల్ యాక్షన్ దట్టించారు. గన్ ఫైరింగ్, ఫైటింగ్.. ఇలా సమంత అదరగొట్టేసింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ట్రైలర్‌తోనే బజ్ వచ్చిందంటే మాత్రం సిరీస్‌పై కచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. సమంత కొత్త ట్రైలర్‪‌పై మీరు ఓ లుక్కేసేయండి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement