కొన్నాళ్ల క్రితం హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయింది. ఈమెనే కాదు చాలామంది సెలబ్రిటీలకు ఇలానే జరిగింది. ఈ విషయమై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మికని నియమించారు. సైబర్ నేరాలపై ఈమెతోనే అవగాహన కల్పించారు. ఈ మేరకు రష్మిక ఓ వీడియో షేర్ చేసింది.
(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత)
రష్మిక ఏమందంటే?
'నా డీప్ ఫేక్ వీడియోని చాలా వైరల్ చేశారు. అదో సైబర్ నేరం. అప్పుడే ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. కేంద్ర హోం అఫైర్స్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పనిచేస్తోంది. ఆ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్. సైబర్ నేరగాళ్లు ఎలా దాడి చేస్తారో చెప్పలేం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరం కలిసికట్టుగా పోరాడుదాం. సైబర్ నేర రహిత దేశాన్ని సృష్టించుకుందాం' అని రష్మిక చెప్పింది.
కర్ణాటకకు చెందిన ఈమె చాలా తక్కువ టైంలోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. 'పుష్ప' మూవీ ఈమెకు వేరే లెవల్ క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ మూవీస్ ఉన్నాయి. ఇవి కాకుండా పలు హిందీ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది.
(ఇదీ చదవండి: కోలుకున్న రజినీకాంత్.. 'వేట్టయన్' టీమ్‌తో ఇలా)
Comments
Please login to add a commentAdd a comment