కమెడియన్లని అవమానించిన గౌతమ్? రెచ్చిపోయిన అవినాష్ | Bigg Boss 8 Telugu Day 43 Promo Gautham Vs Avinash | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: కామెడీని తీసుకోలేకపోయిన గౌతమ్.. మొత్తం గొడవ

Published Mon, Oct 14 2024 11:13 AM | Last Updated on Mon, Oct 14 2024 11:33 AM

Bigg Boss 8 Telugu Day 43 Promo Gautham Vs Avinash

బిగ్‌బాస్ షోలో మిగతా వాటి సంగతి పక్కనబెడితే కాస్తంత కామెడీ ఉంటేనే జనాలు చూస్తారు. ఈసారి అది లేకపోవడం వల్లే గత సీజన్లలో పాల్గొన్న పలువురిని వైల్డ్ కార్డ్స్ పేరిట మళ్లీ తీసుకొచ్చారు. ఉన్నంతలో రోహిణి, అవినాష్ కాస్త ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ వాళ్లిద్దరినీ అవమానించేలా కామెంట్స్ చేశాడు. ఇదేం కామెడీ షో కాదు అని చెబుతూనే గొడవ చేశాడు. దీంతో అవినాష్ రెచ్చిపోయాడు.

గతవారం ఫన్ టాస్క్ సందర్భంగా గౌతమ్‌ని ఇమిటేట్ చేసిన అవినాష్. అశ్వద్ధామ 2.0 అని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గౌతమ్ అది ఇబ్బందిగా అనిపించింది. దీంతో మైక్ తీసి నేలకేసి కొట్టాడు. అయితే అప్పుడు మైక్ తీసి పడేయడం తనకు నచ్చలేదని కారణం చెప్పిన రోహిణి.. గౌతమ్‌ని ఈ వారం నామినేట్ చేసింది. కామెడీ, మరేదైనా గానీ బుల్లీయింగ్ (పరోక్షంగా బాధపెట్టడం) లాంటిదని గౌతమ్ నోరు జారాడు. ఇది చాలా పెద్ద మాట అని హౌస్‌మేట్స్ అందరూ సీరియస్ అయ్యారు.

(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)

బుల్లీయింగ్ అంటే ఓ మనిషికి నచ్చని విషయాన్ని మళ్లీ మళ్లీ గుచ్చి గుచ్చి చెబుతారా అని గౌతమ్ ఆవేశపడిపోయాడు. పక్కనే ఉన్న అవినాష్ ఇక తట్టుకోలేకపోయాడు. మాకు తెలీదు తెలీదు తెలీదు అని ఫైర్ అయ్యాడు. మేం కావాలని చెయ్యలేదు, వేలు పెట్టి కెలకలేదు అన్నాడు. దీంతో ఇదేం కామెడీ షో కాదు, మనం వచ్చింది బిగ్‌బాస్ షోకి అని గౌతమ్ మరోసారి మాట తూలాడు. ఫలితంగా అవినాష్ రెచ్చిపోయాడు.

'కామెడీ తీసుకోలేనప్పుడు డబ్బులు తీసుకోకండి. షోకు రాకండి. కామెడీ అంటే ఏమనుకుంటున్నారో' అని అవినాష్ తన జాకెట్ విసేరేశాడు. గౌతమ్‌ని అశ్వద్ధామ 2.0 అనకండ్రా, మీకు దండం పెడతాను అని కెమెరా చూస్తూ అతడి ఫ్యాన్స్‌కి చెప్పాడు. పక్కనే ఉన్న గౌతమ్‌కి క్షమాపణలు కూడా చెబుతూనే సారీ భయ్యా, నాకు తెలీదు అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే కామెడీ చేయడం ఏమో గౌతమ్‌కి తీరా చేస్తేనేమో తీసుకోలేకపోతున్నాడు. చూస్తుంటే ఈ గొడవే సోమవారం ఎపిసోడ్ అంతా ఉండేలా కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement