gowtham krishna
-
Bigg Boss 8 : గౌతమ్ హిస్టరీ క్రియేట్ చేసేనా?
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ పోకిరిలో పూరీ రాసిన డైలాగ్ బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణకి బాగా సరిపోతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టినా.. తనదైన ఆటతీరుతో ముందు నుంచి ఉన్నవాళ్లను పక్కకి నెట్టి తన గ్రాఫ్‌ని పెంచుకున్నాడు. తనకు ఉన్న షార్ట్ టెంపర్‌కి మహా అయితే రెండు మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేడులే అనుకున్న వాళ్ల అంచనాలను తారుమారు చేస్తూ..టాప్ 5లోకి వచ్చేశాడు. అంతేకాదు సీజన్ 8 విన్నర్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో గౌతమ్ ఉండడం గమనార్హం.ఈ సీజన్లో టాప్ 5లోకి అవినాష్, నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్ చేరుకున్నారు. అయితే పోటీ మాత్రం నిఖిల్-గౌతమ్ మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా ఇద్దరి మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు నిఖిల్ పై స్థాయిలో ఉంటే..ఇప్పుడు మాత్రం గౌతమ్ టాప్ 1లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పలు వెబ్సైట్లు పెట్టిన పోలింగ్‌లోనూ విన్నర్ గౌతమే అని తేలుతోంది. ఈ సారి తెలుగు వాడే విన్నర్ అవుతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతుంది. తెలుగు వాడిని విన్నర్ చేయండి అంటూ నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు.Gautham nuvvu eliminated ane situation nunchi Gautham is the winner ane situation ki tisukoni vachadu💪🔥🔥This Is The Most Inspirational Journey In The Entire BB History💥🥵🥵🤙 #GauthamVote For Gautham Win🏆🏆😍#BiggBosTelugu8 #GauthamKrishna 🏆#VoteforGauthamKrishna pic.twitter.com/fmnRQBu22O— S.Harsha Vardhan (@Harsha3633) December 9, 2024కన్నడ వెర్సస్ తెలుగుబిగ్‌బాస్ షోలో ఈ సారి కంటెస్టెంట్స్ రెండు రకాలుగా విడిపోయారు. నిఖిల్, పృథ్వి, యష్మి కలిసి ఆడడంతో వాళ్లను కన్నడ బ్యాచ్‌గా, మిగతవారిని తెలుగు బ్యాచ్‌గా కంటెస్టెంట్స్‌తో పాటు వీక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇదంతా వైల్డ్ కార్టు ఎంట్రీ తర్వాతే జరిగింది. నిఖిల్, పృథ్వి, యష్మి కలిసి గేమ్ అడుతున్నారనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో గౌతమ్ సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో హోస్ట్ నాగార్జునతో కూడా వాగ్వాదానికి దిగడం గౌతమ్‌కి కలిసొచ్చింది.హిస్టరీ క్రియేట్ చేసేనా?వాస్తవానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఎంత బాగా ఆడినా..ఓటింగ్‌కి వచ్చేసరికి వెనుకబడిపోతారు. కానీ గౌతమ్ కృష్ణ మాత్రం ప్రతి వారం నామినేషన్స్‌లో ఉన్నా.. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులు మనసులు గెలుచుకున్నాడు. గతంలో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లు టాప్ 5లోకి చేరారు కానీ విన్నర్‌గా నిలవలేదు. ఆడియన్స్‌తో కూడా వాళ్లు విన్నర్ అవుతారని భావించలేదు. కానీ ఈ సారి మాత్రం విన్నర్ రేసులో గౌతమ్ పేరు బలంగా వినిపిస్తుంది. మరోవైపు నిఖిల్ కూడా విన్నర్ రేసులో ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయనకు కూడా భారీగా మద్దతు లభిస్తోంది. కానీ గత రెండు రోజులుగా గౌతమ్‌కి మద్దతు పెరుగుతోంది. తెలుగు వాడిని విన్నర్ చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బిగ్‌బాస్ మాజీలు అఖిల్ సార్థక్, ఆర్జే కాజల్, సోహైల్‌తో పాటు మరికొంతమంది సీరియల్ నటీనటులు గౌతమ్‌కు ససోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. మరి సీజన్ 8 విన్నర్ ఎవరనేది తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే. #GauthamKrishna inspired everyone by highlighting that life's ups and downs are natural, urging us to rise above challenges with courage and determination. Let’s make him the Bigg Boss winner🏆vote for Gautham!Missed call to 7997983717#BiggBossTelugu8 #Biggboss #gautham pic.twitter.com/aoeXOxj1fM— Gautham Krishna (@igauthamkrishna) December 11, 2024 -
కమెడియన్లని అవమానించిన గౌతమ్? రెచ్చిపోయిన అవినాష్
బిగ్‌బాస్ షోలో మిగతా వాటి సంగతి పక్కనబెడితే కాస్తంత కామెడీ ఉంటేనే జనాలు చూస్తారు. ఈసారి అది లేకపోవడం వల్లే గత సీజన్లలో పాల్గొన్న పలువురిని వైల్డ్ కార్డ్స్ పేరిట మళ్లీ తీసుకొచ్చారు. ఉన్నంతలో రోహిణి, అవినాష్ కాస్త ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ వాళ్లిద్దరినీ అవమానించేలా కామెంట్స్ చేశాడు. ఇదేం కామెడీ షో కాదు అని చెబుతూనే గొడవ చేశాడు. దీంతో అవినాష్ రెచ్చిపోయాడు.గతవారం ఫన్ టాస్క్ సందర్భంగా గౌతమ్‌ని ఇమిటేట్ చేసిన అవినాష్. అశ్వద్ధామ 2.0 అని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గౌతమ్ అది ఇబ్బందిగా అనిపించింది. దీంతో మైక్ తీసి నేలకేసి కొట్టాడు. అయితే అప్పుడు మైక్ తీసి పడేయడం తనకు నచ్చలేదని కారణం చెప్పిన రోహిణి.. గౌతమ్‌ని ఈ వారం నామినేట్ చేసింది. కామెడీ, మరేదైనా గానీ బుల్లీయింగ్ (పరోక్షంగా బాధపెట్టడం) లాంటిదని గౌతమ్ నోరు జారాడు. ఇది చాలా పెద్ద మాట అని హౌస్మేట్స్ అందరూ సీరియస్ అయ్యారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)బుల్లీయింగ్ అంటే ఓ మనిషికి నచ్చని విషయాన్ని మళ్లీ మళ్లీ గుచ్చి గుచ్చి చెబుతారా అని గౌతమ్ ఆవేశపడిపోయాడు. పక్కనే ఉన్న అవినాష్ ఇక తట్టుకోలేకపోయాడు. మాకు తెలీదు తెలీదు తెలీదు అని ఫైర్ అయ్యాడు. మేం కావాలని చెయ్యలేదు, వేలు పెట్టి కెలకలేదు అన్నాడు. దీంతో ఇదేం కామెడీ షో కాదు, మనం వచ్చింది బిగ్‌బాస్ షోకి అని గౌతమ్ మరోసారి మాట తూలాడు. ఫలితంగా అవినాష్ రెచ్చిపోయాడు.'కామెడీ తీసుకోలేనప్పుడు డబ్బులు తీసుకోకండి. షోకు రాకండి. కామెడీ అంటే ఏమనుకుంటున్నారో' అని అవినాష్ తన జాకెట్ విసేరేశాడు. గౌతమ్‌ని అశ్వద్ధామ 2.0 అనకండ్రా, మీకు దండం పెడతాను అని కెమెరా చూస్తూ అతడి ఫ్యాన్స్‌కి చెప్పాడు. పక్కనే ఉన్న గౌతమ్‌కి క్షమాపణలు కూడా చెబుతూనే సారీ భయ్యా, నాకు తెలీదు అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే కామెడీ చేయడం ఏమో గౌతమ్‌కి తీరా చేస్తేనేమో తీసుకోలేకపోతున్నాడు. చూస్తుంటే ఈ గొడవే సోమవారం ఎపిసోడ్ అంతా ఉండేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
'సోలో బాయ్' ఛాలెంజ్ గెలిస్తే రూ. 30 వేలు బహుమతి
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై ఒక సినిమా తెరకెక్కుతుంది. సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి 'సోలో బాయ్' టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా నుంచి ఒక హుక్ స్టెప్‌తో మేకర్స్ ఛాలెంజ్‌గా విసిరారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్‌ను తాజాగా లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ .. 'నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా మీడియాతో పాటు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్‌కు కృతజ్ఞతలు. సోలో బాయ్ సాంగ్ చూసిన అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ నవీన్ మంచి సినిమాను అందించాడు. నా తమ్ముడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గౌతమ్ ఫ్యూచర్లో కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.సోలో బాయ్ టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ చాలెంజ్ చేసిన వాళ్లకి మొదటి బహుమతిగా 30,000 రెండవ బహుమతిగా 20,000 మూడో బహుమతిగా 10,000 ఇస్తామని హీరో గౌతమ్ కృష్ణతో పాటు కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తెలిపారు. ఈ స్టెప్‌తో వీడియో తీసి తమ టీమ్‌ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళ నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసి మీడియా ముందే బహుమతిని ఇస్తామని పేర్కొన్నారు. టైటిల్ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రచిస్తే.. రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడారని తెలిపారు. -
ఆకాశ వీధుల్లో మూవీ రివ్యూ
టైటిల్ : ఆకాశ వీధుల్లో నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ దర్శకత్వం: గౌతమ్ కృష్ణ సంగీతం : జూడా శాండీ సినిమాటోగ్రఫీ:విశ్వనాధ్ రెడ్డి విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 ఈ మధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలు వారి సినిమా కథలను వారే రాసుకుంటున్నారు. కొంతమంది అయితే నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో ఇండస్గ్రీలో తమ మార్క్‌ను చూపించుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకి వచ్చాడు గౌతమ్ కృష్ణ. ‘ఆకాశ వీధుల్లో’సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 2) థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సిద్దు(గౌతమ్ కృష్ణ)కి మ్యూజిక్ అంటే ప్రాణం. చదువు అంతగా రాదు కానీ..సంగీతంపై మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే సిద్ధు తండ్రి(దేవీ ప్రసాద్)కి మాత్రం అది నచ్చదు. కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటాడు. ఇదే విషయం సిద్దుతో చెబితే..తనకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని, సంగీతం నేర్చుకుంటానని చెబుతాడు. తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడు. ఎప్పటికైనా రాక్ స్టార్ అవుతానని కలలు కంటాడు. మ్యూజిక్ ప్రయత్నాలు చేస్తూనే.. నిషా(పూజితా పొన్నాడ)తో ప్రేమలో పడిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత నిషా తో మనం లివింగ్ లో ఉందామని చెపుతాడు సిద్దు. నిషా మాత్రం తనకు లవ్‌పై నమ్మకం లేదని చెప్పి అతనికి దూరంగా ఉంటుంది.ప్రేమ విఫలం కావడంతో సిద్దు మద్యానికి, డ్రగ్స్‌కి అలవాటు పడతాడు. ఫ్రెండ్స్ చెప్పిన వినకుండా నిత్యం డ్రగ్స్ తీసుకుంటూ సంగీతాన్ని పూర్తిగా పక్కకి పెడతాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినని పరిస్థితుల్లో ఉన్న సిద్దు తన గర్ల్ ఫ్రెండ్ నిషా ప్రేమను తిరిగి పొందగలిగాడా లేదా? సామాన్యుడైన సిద్దు చివరకు రాక్‌స్టార్ అయ్యాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. లవ్ ఫెయిల్యూర్‌తో హీరో డిప్రెషన్లో పడిపోవడం, తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టి విజయం సాధించడం. ఇలాంటి చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఆకాశ వీధుల్లో కూడా ఇదే కోవలోకి వస్తుంది. అయితే కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. ప్రస్తుత యంగ్‌స్టర్స్ ఎలా ఉంటున్నారు? వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? మనలో మనకు జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది? కుటుంబ పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయనే అంశాలను తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు గౌతమ్. ఇందులో ఆయనే హీరో అవ్వడం కలిసొచ్చింది.కొన్ని లవ్ సీన్స్ మరియు ప్రయాణ సన్నివేశాలు కొత్తగా లేకపోయినా, ఆ సన్నివేశాలు మిమ్మల్ని కాసేపు నిమగ్నం చేస్తాయి హీరో పాత్రని ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. దర్శకుడిగా గౌతమ్‌కి ఇది తొలి సినిమానే అయినా కథనం, సంభాషణలు ఇవన్నీ చక్కగా కుదిరేలా రాసుకున్నాడు. ఎవరెలా చేశారంటే.. గౌతమ్ కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా అది తెరపై కనిపించకుండా..పాత్ర పరిధిమేరకు చక్కగా నటించాడు. అటు రొమాంటిక్ పాత్రలో, ఇటు రాక్ స్టార్ పాత్రలో రెండు షేడ్స్ వున్న పాత్రలలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. నిషా గా పూజిత పొన్నాడ తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టుకుంటుంది. సిద్దు తండ్రిగా నటించిన దేవి ప్రసాద్.. మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. నిషా తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ బాగా యాక్ట్ చేశారు.సిద్దుకు తల్లిగా బాల పరాశర్, చెల్లి గా దివ్య నార్ని తమదైన నటనతో మెప్పించారు. ఫ్రెండ్స్ పాత్రలో నటించిన ఆనంద్ (రిషి),సత్యం రాజేష్ లు తన నటనతో ఆకట్టుకున్నారు . మీర్జాపూర్ ఫెమ్ హర్షిత గౌర్ స్పెషల్ అప్పిరియన్స్ గా అలరించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జూడా శాండీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. సింగర్ కాల భైరవ ఆలపించిన ‘జతగా నువ్వు లేని ఏకాకిగా’ పాట ఆకట్టుకుంటుంది. విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. శశాంక్ నాగరాజు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
శ్రీవారి సేవలో మహేష్‌బాబు కుటుంబం
– శ్రీవారికి తలనీలాలు సమర్పించిన నమత్రా శిరోద్కర్ సాక్షి, తిరుమల: సినీహీరో మహేష్‌బాబు సతీమణి నమత్రా శిరోద్కర్, కుమారుడు గౌతమ్‌కృష్ణ , కుమార్తె సితార బుధవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తర్వాత ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత రంగనాయక మండపంలో వారికి పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయాధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల వచ్చిన వారిని చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. వారి వెంట సినీదర్శకుడు మెహర్ రమేష్ కూడా ఉన్నారు.