Bigg Boss 8 : గౌతమ్‌ హిస్టరీ క్రియేట్‌ చేసేనా? | Bigg Boss 8 Telugu: Gowtham Krishna Name Trending In Social Media Ahead Of BB Grand Finale, More Details Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: గౌతమ్‌ హిస్టరీ క్రియేట్‌ చేసేనా?

Published Wed, Dec 11 2024 3:03 PM | Last Updated on Wed, Dec 11 2024 3:26 PM

Bigg Boss 8 Telugu: Gowtham Krishna Name Trending In Social media

ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ పోకిరిలో పూరీ రాసిన డైలాగ్ బిగ్‌బాస్‌ 8 కంటెస్టెంట్‌ గౌతమ్‌ కృష్ణకి బాగా సరిపోతుంది. వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టినా.. తనదైన ఆటతీరుతో ముందు నుంచి ఉన్నవాళ్లను పక్కకి నెట్టి తన గ్రాఫ్‌ని పెంచుకున్నాడు. తనకు ఉన్న షార్ట్‌ టెంపర్‌కి మహా అయితే రెండు మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేడులే అనుకున్న వాళ్ల అంచనాలను తారుమారు చేస్తూ..టాప్‌ 5లోకి వచ్చేశాడు. అంతేకాదు సీజన్‌ 8 విన్నర్‌ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో గౌతమ్‌ ఉండడం గమనార్హం.

ఈ సీజన్‌లో టాప్‌ 5లోకి అవినాష్‌, నిఖిల్‌, నబీల్‌, ప్రేరణ, గౌతమ్‌ చేరుకున్నారు.  అయితే పోటీ మాత్రం నిఖిల్‌-గౌతమ్‌ మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్‌ పరంగా ఇద్దరి మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు నిఖిల్‌ పై స్థాయిలో ఉంటే..ఇప్పుడు మాత్రం గౌతమ్‌ టాప్‌ 1లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పలు వెబ్‌సైట్లు పెట్టిన పోలింగ్‌లోనూ విన్నర్‌ గౌతమే అని తేలుతోంది. ఈ సారి తెలుగు వాడే విన్నర్‌ అవుతారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతుంది. తెలుగు వాడిని విన్నర్ చేయండి అంటూ నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు.

కన్నడ వెర్సస్‌ తెలుగు
బిగ్‌బాస్‌ షోలో ఈ సారి కంటెస్టెంట్స్‌ రెండు రకాలుగా విడిపోయారు. నిఖిల్‌, పృథ్వి, యష్మి కలిసి ఆడడంతో వాళ్లను కన్నడ బ్యాచ్‌గా, మిగతవారిని తెలుగు బ్యాచ్‌గా కంటెస్టెంట్స్‌తో పాటు వీక్షకులు కూడా ఫిక్స్‌ అయిపోయారు. అయితే ఇదంతా వైల్డ్‌ కార్టు ఎంట్రీ తర్వాతే జరిగింది. నిఖిల్‌, పృథ్వి, యష్మి కలిసి గేమ్‌ అడుతున్నారనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో గౌతమ్‌ సక్సెస్‌ అయ్యాడు. ఈ విషయంలో హోస్ట్‌ నాగార్జునతో కూడా వాగ్వాదానికి దిగడం గౌతమ్‌కి కలిసొచ్చింది.

హిస్టరీ క్రియేట్‌ చేసేనా?
వాస్తవానికి వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఎంత బాగా ఆడినా..ఓటింగ్‌కి వచ్చేసరికి వెనుకబడిపోతారు. కానీ గౌతమ్‌ కృష్ణ మాత్రం ప్రతి వారం నామినేషన్స్‌లో ఉన్నా.. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులు మనసులు గెలుచుకున్నాడు. గతంలో కూడా వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లు టాప్‌ 5లోకి చేరారు కానీ విన్నర్‌గా నిలవలేదు. ఆడియన్స్‌తో కూడా వాళ్లు విన్నర్‌ అవుతారని భావించలేదు. కానీ ఈ సారి మాత్రం విన్నర్‌ రేసులో గౌతమ్‌ పేరు బలంగా వినిపిస్తుంది. మరోవైపు నిఖిల్‌ కూడా విన్నర్‌ రేసులో ఉన్నారు. 

సోషల్‌ మీడియాలో ఆయనకు కూడా భారీగా మద్దతు లభిస్తోంది. కానీ గత రెండు రోజులుగా గౌతమ్‌కి మద్దతు పెరుగుతోంది. తెలుగు వాడిని విన్నర్‌ చేయాలని చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బిగ్‌బాస్‌ మాజీలు అఖిల్‌ సార్థక్‌, ఆర్జే కాజల్‌, సోహైల్‌తో పాటు మరికొంతమంది సీరియల్‌ నటీనటులు గౌతమ్‌కు ససోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. మరి సీజన్‌ 8 విన్నర్‌ ఎవరనేది తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement