ఆలయం వెలుపల నమత్రా శిరోద్కర్, గౌతమ్‌కృష్ణ, సితార
శ్రీవారి సేవలో మహేష్‌బాబు కుటుంబం
Published Wed, Sep 21 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
– శ్రీవారికి తలనీలాలు సమర్పించిన నమత్రా శిరోద్కర్
సాక్షి, తిరుమల:
సినీహీరో మహేష్‌బాబు సతీమణి నమత్రా శిరోద్కర్, కుమారుడు గౌతమ్‌కృష్ణ , కుమార్తె సితార బుధవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తర్వాత ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత రంగనాయక మండపంలో వారికి పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయాధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల వచ్చిన వారిని చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. వారి వెంట సినీదర్శకుడు మెహర్ రమేష్ కూడా ఉన్నారు.
Advertisement
Advertisement