Prithvi Raj
-
అవినాష్ భార్యపై పృథ్వీ చీప్ కామెంట్స్.. మరీ ఇలానా?
బిగ్‌బాస్ 8 షో మరీ హద్దులు దాటేస్తున్నట్లు కనిపిస్తుంది. మాట్లాడుకోవడం, తన్నుకోవడం అనేది గేమ్స్ వరకు అయితే పర్లేదు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. మంగళవారం ఎపిసోడ్లో అలాంటి గొడవే జరిగింది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఫ్రెండ్షిప్ అనే పదాన్ని తీసి మరీ తనని బాధపెట్టారని యష్మి ఏడ్చింది. దీంతో ప్రేరణ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక గ్రూప్‌గా ఫామ్ అయిన నిఖిల్.. నబీల్, పృథ్వీ, మణికంఠతో మాట్లాడుతూ తేజని ఎలాగైనా సరే టార్గెట్ చేయాలని అన్నాడు. గుర్రం సౌండ్ వినిపించగానే యష్మి టోపీ లాగేసుకుని ప్రేరణకి ఇచ్చింది. పోడియంపై నిలబడ్డ విష్ణుప్రియ.. రివేంజ్ పేరుతో నయని పావనిని నామినేట్ చేయాలనుకుంది. కానీ రివేంజ్ అనేది ఇక్కడ కుదరదని బిగ్‌బాస్ అల్టిమేటం ఇచ్చేశాడు. ఇదంతా చూసిన తేజ.. ఓజీ క్లాన్ బండారాన్ని బయటపెట్టాడు. తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. ఓజీ vs తేజ చేసేస్తున్నారని, ఇక మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతా అని తేజ.. వాళ్లకు సవాలు విసిరాడు.(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)తర్వాత వచ్చిన పృథ్వీ.. ప్రోమో చూసి తను టాస్క్‌లు ఆడుతున్నానని చెప్పడం అస్సలు నచ్చలేదని అవినాష్‌ని నామినేట్ చేశాడు. దీంత ఇద్దరి మధ్య తగువు మొదలైంది. 'నేను చూసిన ఎపిసోడ్స్‌లో రెండు మూడు టాస్క్‌లు తప్పితే ఎక్కడా కనిపించలేదు. మా వైఫ్ చూసింది' అని అవినాష్ అనగానే.. మరి అలాంటిప్పుడు మీ భార్యనే బిగ్‌బాస్‌కి రావాల్సింది, మీరెందుకు వచ్చారు అని పృథ్వీ నోరు జారాడు. వైఫ్ టాపిక్ తీయకు అని అవినాష్ సీరియస్ అయ్యాడు.సోఫాలు కూర్చోవడం తప్పితే ఇంకేం చేయవ్ అని అవినాష్ అనేసరికి.. కామెడీ తప్ప ఇంకేం చేశావ్ నువ్వు అని పృథ్వీ అన్నాడు. పోయిన వారం నేను ఏ పాయింట్ చెప్పానో, ఈ వారం కూడా గంగవ్వ అదే పాయింట్ చెప్పిందని అవినాష్ అనేసరికి.. 'గంగవ్వ పేరు ఎందుకు చెబుతావ్ రా' అని పృథ్వీ మరోసారి నోరు జారాడు. 'రేయ్ రా అనకు' అని అవినాష్ వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇది నీ సంస్కారం. బిగ్‌బాస్‌కి వచ్చావ్ కదా నేర్చుకో' అవినాష్-పృథ్వీ ఒకరిపై ఒకరు వెళ్లారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత) -
రిలీజైన 'సలార్' సాంగ్.. ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు!
ప్రభాస్ 'సలార్' మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానుంది. అయితే మూవీ టీమ్.. కనీసం ప్రచారం లాంటి వాటి జోలికి వెళ్లకపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా పక్కనబెడితే తాజాగా సినిమాలోని ఓ పాట రిలీజ్ చేశారు. అదయితే ఫ్యాన్స్‌కి మాములు షాక్ ఇవ్వలేదు. ఇంతకీ ఈ పాట ఎలా ఉంది? సాంగ్‌తో స్టోరీ హింట్ ఇచ్చారా? (ఇదీ చదవండి: Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!) 'కేజీఎఫ్' తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో మాస్ సినిమా తీస్తున్నాడనేసరికి ఫ్యాన్స్ చొక్కాలు చింపేసుకున్నారు. మాస్ బొమ్మ గ్యారంటీ అని ఊగిపోయారు. కానీ వాయిదాల వాయిదాల పడటంతో సినిమాపై స్వయంగా అభిమానులకే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన పాట అయితే ఎలివేషన్స్ ఉన్న హీరోయిక్ సాంగ్ కాకుండా ఎమోషనల్‌గా ఉంది. ఈ పాటలో సాహిత్యం బాగుంది, 'సలార్' మూవీ ఎలా ఉండబోతుందనే హింట్ కూడా ఇచ్చారు. మూవీ రిలీజ్ పెట్టుకున్న ఈ టైంలో.. మంచి హై ఇచ్చే సాంగ్ రిలీజ్ చేయాలి గానీ ఇలాంటి ఎమోషనల్ పాట విడుదల చేసేరేంటి? అని డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఏదేమైనా సరే సినిమా బాగుంటే.. ఇవన్నీ ఎవరూ పట్టించుకోరు. చూద్దాం మరి ఏం జరుగుతుందో? డిసెంబరు 22 వరకు వెయిట్ చేస్తే 'సలార్' రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది! (ఇదీ చదవండి: హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్) -
షూటింగ్లో పాల్గొన్న ప్రముఖ నటుడికి కరోనా
ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. షూటింగ్లో పాల్గొన్న ఆయనకు కోవిడ్ అని తేలడంతో యూనిట్ సభ్యులు క్వారంటైన్లోకి వెళ్లారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జన గణ మన' అనే మూవీ షూటింగ్లో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. కొచ్చిలో జరుగుతున్న ఈ షూటింగ్ చివరి షెడ్యూల్లో భాగంగా పాల్గొన్న యూనిట్ అందరికీ పరీక్షలు నిర్వహించగా పృథ్వీరాజ్‌తో పాటు డైరెక్టర్ ఆంటోనీకి సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోయినా తనకు కరోనా వచ్చిందని, ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నట్లు పృథ్వీరాజ్ తెలిపాడు. త్వరలోనే కోలుకొని తిరిగి షూటింగ్లో పాల్గొంటానని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా సెట్లోని ఇద్దరికి కరోనా సోకడంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాకుండా యూనిట్‌లోని మిగతా సిబ్బంది జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో తదుపరి సమాచారం వచ్చే వరకు షూటింగ్ నిలిపివేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. -
ఇద్దరూ ఇద్దరే
-
ఇద్దరూ 420 గాళ్లే
పోసాని కృష్ణమురళి, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ, అర్జున్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దేశముదుర్స్’. ‘ఇద్దరూ 420 గాళ్లే’ అన్నది ఉపశీర్షిక. కన్మణి దర్శకత్వంలో కుమార్ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కన్మణి మాట్లాడుతూ –‘‘పోసాని, పృథ్వీగారు ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రల్లో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి వచ్చిన సినిమా ఇది. వాళ్లిద్దరూ తెరపై కాసేపు కనిపిస్తేనే నవ్వుకుంటాం. అలాంటిది సినిమా అంతా నవ్విస్తే ఇంకెన్ని నవ్వులు పువ్వులు పూస్తాయో చెప్పాల్సిన పనిలేదు. కథకు హారర్ టచ్ కూడా ఇచ్చాం. అర్జున్ మంచి పెర్ఫార్మర్’’ అన్నారు. ‘‘కన్మణి మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే రెండో వారంలో లేదా మూడోవారంలో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత కుమార్. సంగీత దర్శకుడు యాజమాన్య, మాటల రచయిత భవానీ ప్రసాద్, పాటల రచయిత రాంబాబు, ఛాయాగ్రాహకుడు అడుసుమిల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పులిగుండ్ల సతీష్ కుమార్, వద్దినేని మాల్యాద్రి. -
అక్టోబర్ 16న ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: హేమామాలిని (నటి), పృథ్వీరాజ్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. పుట్టిన తేదీ 16. ఇది కేతు సంఖ్య కావడం వల్ల వీరిపై ఈ సంవత్సరమంతా కేతుగ్రహప్రభావం బలంగా ఉంటుంది. దీనివల్ల ప్రాపంచిక జీవితంపైన కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ ఏర్పడుతుంది. ఆధ్యాత్మికోన్నతి సాధిస్తారు. మాటకు విలువ ఏర్పడుతుంది. అందరూ గౌరవిస్తారు. వేదపండితులు, జ్యోతిష్యులు, తాంత్రిక విద్యలలో ప్రవేశం ఉన్న వారికి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతానప్రాప్తి కలుగుతుంది. కేతుగ్రహ ప్రభావం వల్ల వీరు ఈ సంవత్సరమంతా ఆధ్యాత్మిక చింతన, తాత్వికత, అతీంద్రియ శక్తులను నేర్చుకోవడం వంటి వాటిపై మొగ్గు చూపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు విదేశాలలో చదువుకోవాలనే కోరిక, ఉద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు చేయాలనే కోరిక తీరతాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. వైద్యవిద్యార్థులకు, వైద్యులకు బాగా పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్రవారాలు. సూచనలు: భూమిని, ఇంటిని అమ్మాలనే ఆలోచనను విరమించుకోవడం మంచిది. సంసార జీవనం పట్ల దృష్టి సారించడం, కేతు గ్రహ జపం చేయించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, పండితులను, గురువులను గౌరవించడం, వికలాంగులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్