
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ పడుతూ లేస్తూ ఎలాగోలా నెల రోజులు పూర్తి చేసుకుంది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఇంటిసభ్యుల ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ముఖానికి ధరించిన మాస్కులు తీసేశారు. చాలామంది సేఫ్ గేమ్ ఆడటాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఒక్కొక్కరి నిజస్వరూపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో అయితే నువ్వా? నేనా? అన్న రీతిలో పోట్లాటకు దిగారు. వీరావేశంతో ఊగిపోయారు. నామినేషన్‌తో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్‌ను కూల్ చేసేందుకు బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో బీబీ హోటల్‌కు గంగవ్వ, అరియానా కస్టమర్లుగా విచ్చేశారు. వచ్చీరాగానే అవినాష్.. అరియానా చేయి పట్టుకొని కాస్త దూకుడు ప్రదర్శించాడు. (చదవండి: అవినాష్ పారితోషికం ఎంతో తెలుసా?)
మోనాల్, దివి, అభిజిత్ స్పా సెంటర్‌లో పని చేస్తారు. అయితే హారిక రాగానే అభి తాను కూడా బాగా చేస్తానంటూ ముందుకు వచ్చాడు. తర్వాత కుమార్ సాయి బెడ్‌రూమ్‌లో స్ప్రే కొడుతుంటే ఇది వాష్‌రూమ్ స్ప్రేలా ఉందని మెహబూబ్ మొహం చిట్లించుకున్నాడు. అంటే మీరు ఎక్కువగా వాష్‌రూమ్‌లో స్పెండ్ చేస్తారనుకుంటానని కుమార్ పంచ్ వేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అఖిల్.. అవినాష్ చెంప ఛెళ్లుమనిపించాడు. కానీ అదంతా టాస్క్‌లో భాగంగానే అని తెలుస్తోంది. ఇక బిగ్‌బాస్ అవినాష్‌కు సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు. అందులో భాగంగా హోటల్ టాస్క్‌ను అల్లకల్లోలం చేయమన్నాడా? ఎవరితోనైనా గొడవ పెట్టుకోవాలని చెప్పాడా? అసలు ఆ సీక్రెట్ టాస్క్ ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి ఆయన తనకిచ్చిన సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! (చదవండి: బిగ్‌బాస్: రీ ఎంట్రీపై స్పందించిన దేవి)