అభిజిత్‌కు అన్యాయం చేసిన అరియానా | Bigg Boss 4 Telugu: Avinash Become Captain, Ariyana As Ration Manager | Sakshi
Sakshi News home page

కెప్టెన్ అయ్యాడో లేదో కొత్త రూల్స్ పెట్టేశాడు

Published Thu, Oct 22 2020 11:21 PM | Last Updated on Thu, Oct 22 2020 11:26 PM

Bigg Boss 4 Telugu: Avinash Become Captain, Ariyana As Ration Manager - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఏడో కెప్టెన్‌గా అవినాష్ ఎన్నిక‌య్యాడు. కెప్టెన్ అయ్యాడ‌న్న మాటేకానీ త‌న స్నేహితురాలు అరియానా కెప్టెన్ అవ్వ‌లేద‌న్న బాధే అత‌నిలో ఎక్కువ‌గా క‌నిపించింది. ఇక అరియానాకి ఉన్న క్లారిటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్‌లో అభిజిత్ కోసం అంద‌రి క‌డుపులు మాడ్చుతుందా అనుకునే స‌మ‌యానికి ఆమె రేష‌న్ తీసుకునేందుకు మొగ్గు చూపడం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. త‌న‌కు ఉన్న క్లారిటీ ఇంట్లో ఎవ‌రికీ లేద‌ని నిరూపించింది. మ‌రోవైపు బ‌య‌ట జ‌రిగిన విష‌యాల కోసం అమ్మ రాజ‌శేఖ‌ర్‌, నోయ‌ల్ గొడ‌వ‌పడ్డారు. దీంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా త‌యారైంది ప‌రిస్థితి. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

నువ్వు ప్రామిస్ మీద నిల‌బ‌డ‌లేదు: మాస్ట‌ర్‌
నోయ‌ల్ మిమ్మ‌ల్ని నామినేట్ చేసిన‌ప్పుడు ఎలా రియాక్ట్ అయ్యార‌ని అభిజిత్ మాస్ట‌ర్‌ను ప్ర‌శ్నించాడు. న‌వ్వుతూనే మొద‌లైన ఈ చర్చ నెమ్మ‌దిగా గొడ‌వ‌కు దారి తీసింది. త‌న సినిమాకు ర్యాప్ సాంగ్ రాసివ్వ‌మ‌ని చెప్పాను. కానీ అది చేయ‌లేదని మాస్ట‌ర్ నోయ‌ల్‌పై మండిప‌డ్డాడు. మ‌ళ్లీ అంత‌లోనే మాట మారుస్తూ.. రాశావు, కానీ అంద‌రికీ అర్థం అయ్యేలా రాయ‌మ‌ని అడిగా, కానీ ఆ ప్రామిస్ మీద నిల‌బ‌డ‌లేదని త‌ప్పు ప‌ట్టాడు. దీనిపై నోయ‌ల్ మాట్లాడుతూ.. తాను రాసిచ్చాన‌ని, పాట కూడా రిలీజ్ అయింద‌ని చెప్పాడు. దానికి త‌న‌కు డ‌బ్బులు ఎందుకు ఇవ్వ‌లేద‌ని కూడా ఇంత‌వ‌ర‌కు ప్ర‌శ్నించ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. ఈ గొడ‌వ‌తో మ‌న‌సు పాడైన నోయ‌ల్ అభిపై త‌న విసుగును ప్ర‌ద‌ర్శించాడు. ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడిగాడు. మ‌రోవైపు ఆవేశం త‌గ్గ‌ని మాస్ట‌ర్ మాత్రం.. కెమెరా కోసం డైలాగులు చెప్తావు, ప్రామిస్ మీద నిల‌బ‌డే క్యారెక్ట‌ర్ కాదు. బ‌య‌ట‌కు వెళ్లిపోయినా కూడా నిన్ను ఎన్ని అనాలో అనేస్తాను అంటూ హెచ్చ‌రించాడు. (చ‌ద‌వండి: నువ్వు పెద్ద తోపు, తురుమేం కాదు: అఖిల్‌)

నా భ‌ర్త యాక్ట‌ర్‌: మోనాల్‌
త‌ర్వాతి రోజు ఉద‌యం మాస్ట‌ర్‌ను చూసి విల‌న్‌లా ఉన్నావ‌ని సోహైల్ అన్నాడు. డ్యాన్స్ బాగా చేస్తున్నావు కానీ ఒక్క స్టెప్పు నేర్పించ‌లేద‌ని దివి బుంగ‌మూతి పెట్టుకుంది. ఈ వ‌య‌సులో కూడా బాగా చేస్తున్నాడు అని సోహైల్ పంచ్ వేశాడు. ఇది మ‌న‌సులో పెట్టుకున్న మాస్ట‌ర్ దివి ప‌క్క‌కు వెళ్ల‌గానే అత‌డికి అక్షింత‌లు వేశాడు. ప‌క్క‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని ప్ర‌శ్నించాడు. నువ్వు న‌న్ను అలా అన‌గానే దివి ఫీలైంద‌ని, నిజానికి త‌న డ్యాన్సు చేసి ఆమె ప‌డిపోయింద‌ని మాస్ట‌ర్ చెప్పుకొచ్చాడు. ఇక మోనాల్ అఖిల్‌ను స‌ర‌దాగా ఓ ఆటాడుకుంది. త‌న భ‌ర్త న‌టుడ‌ని పేర్కొంది. అన్ని భాష‌ల్లో న‌టిస్తాడ‌ని సిగ్గులు ఒల‌క‌బోసింది. కానీ పేరు అడిగితే మాత్రం గుజ‌రాత్‌తో పేరు చెప్పరంటూ త‌ప్పించుకుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మామ స్థానంలో కోడ‌లు సామ్‌?)

మాస్ట‌ర్ సైగ‌తో అవినాష్ స్టేష‌న్‌లోకి మోనాల్‌
బండి తోయ‌రా బాబు కెప్టెన్సీ టాస్కులో అరియానా, అవినాష్ త‌ల‌ప‌డ్డారు. ఎవ‌రి స్టేష‌న్‌లో ఎక్కువ మందిని తోసి దింపేస్తారో వారే గెలిచిన‌ట్లు లెక్క‌. ఇద్ద‌రూ చెరో ఐదుగురిని త‌మ‌త‌మ స్టేష‌న్ల‌లో దింప‌డంతో గేమ్ టై అయింది. దీంతో ప్ర‌త్య‌ర్థి టీమ్‌లో దింపిన‌వాళ్ల‌ను ఆక‌ర్షించి త‌మ స్టేష‌న్‌కు రప్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం పోటీదారులిద్ద‌రూ ఇంటిస‌భ్యుల‌తో బేర‌సారాలు జ‌రిపారు. త‌న‌కోసం నామినేట్ అయినందుకు సోహైల్ అవినాష్‌ను స‌పోర్ట్ చేయ‌క త‌ప్ప‌లేదు. వార‌మంతా ఏ ప‌నీ చేయ‌న‌న్న అభిజిత్ మాట‌కు అంగీక‌రించినందుకు అత‌డు అవినాష్ టీమ్‌లోనే ఉండిపోయాడు. కానీ చివ‌రి నిమిషంలో మోనాల్‌ను ర‌మ్మ‌ని మాస్ట‌ర్ సైగ చేయ‌డంతో ఆమె అవినాష్ టీమ్‌లోకి వ‌చ్చేసింది. కానీ దివి మాత్రం ఎంత‌కూ రాలేద‌ని మాస్ట‌ర్ ఆమెతో ఇక ఫ్రెండ్‌షిప్ క‌ట్ అన్నాడు. ఇక టాస్క్ ముగిసే స‌మ‌యానికి అవినాష్ స్టేష‌న్‌లో ఆరుగురు(అఖిల్‌, మోనాల్‌, లాస్య‌, అభిజిత్‌, మాస్ట‌ర్, సోహైల్‌) ఉండ‌టంతో అతడు గెలిచి కెప్టెన్ అయ్యాడు.

క‌ఠిన రూల్స్ ప్ర‌వేశ‌పెట్టిన అవినాష్‌
తాను కెప్టెన్ అయితే అరియానా కూడా కెప్టెన్ అయిన‌ట్టేన‌ని వెల్ల‌డించాడు. అనంత‌రం ఆమెను రేష‌న్ మేనేజ‌ర్‌గా ఎన్నుకున్నాడు. అవినాష్ ఇంట్లో కొత్త రూల్స్ పెట్టాడు. ఎవ‌రైనా మైక్ మ‌ర్చిపోతే... 50 సార్లు మైక్ మ‌ర్చిపోయాన‌ని చెప్పాల‌ని ఆదేశించాడు. రెండుసార్లు క‌న్నా ఎక్కువ‌ నిద్ర‌పోతే రెండుసార్లు స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాలి. తెలుగులో మాట్లాడ‌క‌పోతే కెమెరా ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఇంకోసారి ఇంగ్లీషులో మాట్లాడ‌ను అని చిన్న‌పిల్లాడిలా న‌టిస్తూ చెప్పాల‌ని పేర్కొన్నాడు. వీట‌న్నింటికీ ఇంటిస‌భ్యులు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌కుండా త‌లాడించ‌డం విశేషం. త‌ర్వాత‌ రేష‌న్ మేనేజ‌ర్ అరియానాను బిగ్‌బాస్ ఇర‌కాటంలో ప‌డేశాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మోనాల్ కోసం అరియానా త్యాగం

అభిజిత్ ల‌గేజీ వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి వెళ్లిపోయింది
అభిజిత్ వ‌స్తువులు లేదా రేష‌న్ స‌రుకుల్లో ఏదో ఒక‌టిని మాత్ర‌మే తీసుకోవాల‌ని చెప్పాడు. అంద‌రూ అరియానా రేష‌న్ సామాను ప‌ట్టుకొస్తుంద‌నుకున్నారు. కానీ ఆమె మాత్రం మ‌రోలా ఆలోచించింది. తోటి కంటెస్టెంటు బ‌ట్ట‌లు లేకుండా సీజ‌న్ మొత్తం బాధ‌ప‌డ‌టం నాకిష్టం లేదు, కావాలంటే ఈ ఒక్క‌వారం ఎలాగోలా అంద‌రం స‌ర్దుకుపోతాం అని ఆమె చెప్పుకొచ్చింది. కానీ చివ‌రి నిమిషంలో మాత్రం ఇంటిస‌భ్యులు ఆక‌లితో అల‌మ‌టించ‌డం ఇష్టం లేద‌ని, అభికి సారీ చెప్తూ రేష‌న్ తీసుకువ‌చ్చింది. ఇక‌ రాత్రిపూట హారిక అద్దంపై తాను బిగ్‌బాస్ విన్న‌ర్ అని రాసుకుని మురిసిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement