ముక్కు అవినాష్.. జబర్దస్త్ అతనికి జీవితాన్ని ప్రసాదించింది. కమెడియన్‌గా సమాజంలో గుర్తింపును తెచ్చిపెట్టింది. కానీ హఠాత్తుగా వచ్చిపడ్డ లాక్‌డౌన్‌లో అతడిని ఎన్నో కష్టాలు వేధించాయి. ఒకానొక దశలో చావే శరణ్యం అనుకున్నాడు. అలాంటి సమయంలో బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. ఓకే చెప్పాడు. క్వారంటైన్‌కు వెళ్లాడు. లేటుగా వెళ్లినా లేటెస్టుగా వెళ్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లో అడుగు పెట్టాడు. అప్పటిదాకా సోసోగా ఉన్న బిగ్‌బాస్ హౌస్ అతడి రాకతో వినోదాలకు నిలయంగా మారింది. అలా కొన్ని వారాలు గడిచాయి. ఇంతలో నోయల్ వెళ్లిపోతూ అవినాష్, మాస్టర్‌కు క్లాస్ పీకాడు. తన నొప్పి మీద చిల్లర కామెడీ చేశారని మండిపడ్డాడు. దీన్ని అవినాష్ తట్టుకోలేకపోయాడు. స్టేజీ పైనే తీవ్రంగా వ్యతిరేకించాడు. పడ్డవాళ్లు ఎప్పుడూ చెడ్డవాళ్లు కాదని నాగార్జున కూడా అతడిని సముదాయించారు. అయినప్పటికీ ఆ మాటలను అవినాష్ మనసులోనే పెట్టుకున్నట్లు కనిపించింది. ఆ తర్వాత నుంచి కోపంగా మాట్లాడుతూ, ప్రతిదానికి ప్రేక్షకులు చూస్తున్నారంటూ, తన కామెడీని ఎవరేమన్నా సహించను అని చాలా మాట్లాడాడు.
ఆ తర్వాత ఓసారి తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోను వదిలేసి వచ్చానని, మళ్లీ తీసుకోమన్నారని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశాడు. మొన్న ఇమ్యూనిటీ పొందే టాస్కులో కూడా తను షో కోల్పోయానంటూ సపోర్ట్ చేయమని వేడుకున్నాడు. ఆఖరికి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అని ప్రకటించినప్పుడు కూడా మళ్లీ జీరో దగ్గరకు వచ్చాను. శూన్యం అంటూ అంతా అయిపోయిందన్నట్లు మాట్లాడాడు. దీంతో అవినాష్ ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే అవినాష్ మళ్లీ జబర్దస్త్‌లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మాట అంటోంది మేము కాదు.. అవినాష్ తమ్ముళ్లు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. (చదవండి: మోకరిల్లి సారీ చెప్పినా కనికరించని నోయల్)
"అన్నయ్య జబర్దస్త్ షో నుంచి శాశ్వతంగా బయటకు రాలేదు. తన ఇష్టంతోనే బిగ్‌బాస్‌కు వెళ్లాడు. బిగ్‌బాస్ పూర్తయ్యాక మళ్లీ జబర్దస్త్‌లోకి కంటిన్యూ అవచ్చు. మళ్లీ అదే టీమ్.. మాస్ అవినాష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఉండొచ్చు. మల్లెమాల వాళ్లు అన్నయ్యను మళ్లీ తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అన్నయ్య కెరీర్‌లో జబర్దస్త్ ఉండదు అనేది కేవలం రూమర్లే" అని చెప్పుకొచ్చారు. కానీ ఇది ఎవరో పుట్టించిన రూమర్ కాదు. స్వయంగా అవినాషే షోలో ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించాడు. దీంతో అతడు సింపథీ గేమ్ ఆడుతున్నాడని జనాలు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: నీ కాళ్లు పట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా)
Comments
Please login to add a commentAdd a comment