
జబర్దస్త్ అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లో బాగానే ఎంటర్‌టైన్ చేస్తూ టీఆర్పీలు పడిపోకుండా కాపాడుతున్నాడు. అయితే అరియానాతో గుసగుసలు పెడుతూ, చిలిపి పనులు చేస్తూ కెమెరాకు అడ్డం దొరికిపోతున్నాడు. కానీ అతడు చేసిన పనులనే వీకెండ్‌లో నాగార్జున మరోసారి గుర్తు చేస్తే మాత్రం తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ వదిలేయమని రివర్స్‌లో వేడుకుంటున్నాడు. ఇదిలా వుంటే తాజా ప్రోమోలో అరియానా ముందే మోనాల్‌తో పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. (చదవండి: బిగ్‌బాస్: కళ్లకు గాయాలు, ఎలిమినేట్!)
మోనాల్ కూడా అవినాష్‌కు గోరుముద్దలు తినిపిస్తోంది. ఇదంతా చూడటం తన కర్మ అని మాస్టర్ బుర్ర బద్ధలు కొట్టుకున్నాడు. ఇక రోజూ ఇంట్లో ఉండే అమ్మాయిలనే చూసి బోర్ కొడుతోందని ఎవరైనా ఐశ్వర్యను ఇంట్లోకి పంపించమని నోయల్ అర్జీ పెట్టుకున్నాడు. కానీ అదంతా కుదిరే పని కాదు, ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు ఆడవాళ్లు ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ కూడా ఉంది మరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా బయటకు వెళ్లేందుకు లైన్‌లో ఉన్నారు. (చదవండి: బిగ్‌బాస్.. నాకు క్లారిటీ లేకపోతే బాగోదు)
ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు మోనాల్ వేషాలు చూడలేకున్నామని తలలు పట్టుకుంటున్నారు. అఖిల్, అభిజిత్ చాలదని ఇప్పుడు అవినాష్ వెంట పడుతోందా? అని సెటైర్లు విసురుతున్నారు. అవినాష్ మోనాల్‌కు బిస్కెట్లు వేస్తుంటే అరియానా ముఖం మాడిపోయిందని మరికొందరు అంటున్నారు. ఎప్పుడు చూడూ ఈ మోనాల్ సోదేనా? అభిజిత్, హారికల రిలేషన్‌కు కూడా కాస్త స్క్రీన్ స్పేస్ ఇవ్వండని సలహా ఇస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ ఈ "ఏఏఏ-మోనాల్" ప్రోమోలు మాత్రం రోజూ వస్తాయని అంటున్నారు.