బిగ్‌బాస్ నాల్గో సీజన్ అంతిమ ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటికే తన కష్టానికి తోడు, సోహైల్ త్యాగం వల్ల అఖిల్ నేరుగా టాప్ 5లోకి అడుగు పెట్టాడు. దీంతో నామినేషన్ భయాలేవీ లేకుండా మరోవారం గుండెల మీద చెయ్యేసుకుని మిగతావాళ్ల ఆటను ఓ కంట కనిపెట్టనున్నాడు. మరోవైపు హౌస్‌లో కంటెస్టెంట్ల సంఖ్య పలుచబడే కొద్దీ పోటీ వారి మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. దీంతో మనసుకు కష్టంగా అనిపించినా సరే, ఆటకు అడ్డొస్తుందనుకున్న రిలేషన్ మాకొద్దని ఇంటిసభ్యులు నిన్న నాగ్‌కు తేల్చి చెప్పారు. అంటే ట్రోఫీ గెల్చుకునేందుకు వాళ్లు ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోంది. అయితే ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. ప్రస్తుతం నామినేషన్‌లో అభిజిత్, అఖిల్, అవినాష్, మోనాల్, హారిక ఉన్నారు. వీరిలో అఖిల్ సేవ్ అయినట్లు నాగార్జున ఇదివరకే ప్రకటించారు. మిగతా నలుగురిలో అవినాష్, మోనాల్ డేంజర్ జోన్‌లో ఉన్నారు.
పులిహోర కలపడంలో అఖిలే నెంబర్ 1
నామినేషన్‌లో ఉన్న నలుగురిలో ఒకరిని సేవ్ చేస్తున్నట్లుగా ప్రోమోను వదిలారు. మొదటగా ఇంటిసభ్యులు జంటలుగా విడిపోయి డ్యాన్సులు చేశారు. అవినాష్, అరియానా జోడీ రొమాంటిక్ డోసు పెంచి మరీ స్టెప్పులేసినట్లు కనిపిస్తోంది. అభిజిత్-హారిక కూడా తామేమీ తక్కువ కాదని నిరూపించారు. అఖిల్- మోనాల్ కూడా కలిసి డ్యాన్సు చేశారు. ఇక ఈ వారం అఖిల్ అరియానాతో కలిపిన పులిహోర మ్యాటరే బాగా హైలెట్ అవుతోంది. దీనిగురించి నాగ్ ఆరా తీయగా పులిహోర రాజాగా అఖిలే నంబర్ 1 అని మోనాల్ కూడా తేల్చి చెప్పింది. (చదవండి: బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయల్)
అవినాష్‌ను కనికరించని కామధేనువువ
తర్వాత గార్డెన్ ఏరియాలో కామధేనువును ప్రవేశపెట్టారు. అది ఎవరి అభ్యర్థనను మన్నించి అంబా అని అరుస్తే వాళ్లు సేవ్ అయినట్లు అని నాగ్ స్పష్టం చేశారు. దీంతో కంటెస్టెంట్లు ఆవుకు దండాలు పెట్టారు. ఈసారి ఎలాగైనా కాపాడమంటూ వేడుకున్నారు. అవినాష్ అయితే ఏకంగా ఆవు కాళ్లు పట్టుకుని సేవ్ చేయమని అడిగాడు. కానీ తన ప్రయత్నం వృథా అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి కామధేనువు హారికను కనికరించినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక గతవారం ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో తప్పించుకున్న అవినాష్ ఈసారి మాత్రం ఎలిమినేషన్‌లో అడ్డంగా బుక్కైనట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో నేడు అవినాష్ హౌస్ నుంచి నిష్క్రమించనున్నట్లు సమాచారం. మరి నిజంగానే అవినాష్ ఎలిమినేట్ కానున్నాడా? లేదా నాగ్ ఏమైనా ట్విస్టులు ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్‌బాస్: అవినాష్ ఎలిమినేట్!)
Comments
Please login to add a commentAdd a comment