అఖిల్‌, మెహ‌బూబ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం | Bigg Boss 4 Telugu: Akhil And Mehaboob Fight In Task | Sakshi

వాళ్ల‌కు కోపం వ‌స్తోంది, అయినా గెలిచేశారు!

Oct 21 2020 6:56 PM | Updated on Oct 22 2020 1:22 PM

Bigg Boss 4 Telugu: Akhil And Mehaboob Fight In Task - Sakshi

బిగ్‌బాస్ అంటేనే ఒక బొమ్మ‌లాట‌. కంటెస్టెంట్ల‌తో ర‌క‌ర‌కాల ఆటలాడిస్తాడు. న‌టించాలంటాడు, న‌వ్వించాలంటాడు, ఎమోష‌న్స్ దాచేయాలంటాడు. ఇప్పుడు ఇచ్చిన టాస్క్ కూడా అలాంటి కోవ‌కు చెందిన‌దే. ఇందులో రాక్ష‌సులు ఎన్ని వేషాలేసినా, రాచిరంపాలు పెట్టినా మంచి మ‌నుషుల టీమ్‌లోని స‌భ్యులు మాత్రం వీస‌మెత్తు కోపం ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు. ఇది అభిజిత్‌కు ఈజీయేమో కానీ సోహైల్‌కు మాత్రం క‌ఠిన ప‌రీక్ష అనుకున్నారంతా. కానీ టాస్క్ మొద‌ల‌య్యేస‌రికి అంద‌రి ఊహలు త‌ల‌కిందుల‌య్యాయి. కాస్ట్యూమ్ ముట్టుకోవ‌ద్దంటూ అభిజిత్ చిరుకోపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. కానీ సోహైల్ మాత్రం త‌న‌ను బ‌తికుండ‌గానే మ‌మ్మీ(శ‌వం)లా చేస్తున్నప్ప‌టికీ చిరున‌వ్వుతోనే భ‌రించ‌డం విశేషం. ఇక మాస్ట‌ర్‌ను నానార‌కాలుగా హింసిస్తూ విప‌రీతంగా ఆడేసుకున్నారు. (చ‌ద‌వండి: చెప్పొద్దనుకున్నా, కానీ నా అస‌లు పేరు: అరియానా)

కాగా నేడు రాక్ష‌సుల‌ను మంచి మ‌నుషులుగా మార్చేందుకు బిగ్‌బాస్ నేడు మ‌రిన్ని టాస్కులు ఇవ్వ‌నున్నాడు. కానీ రాక్ష‌సుడి నుంచి మంచి మ‌నిషిగా మారిన అఖిల్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక‌పోయాడు. డ్ర‌మ్ముల్లో నీళ్లు నింపాల‌న్న‌ టాస్కును చెడ‌గొడుతున్న మెహ‌బూబ్‌ను ఒక్క తోపు తోశాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌ర‌గనున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక‌ మెహ‌బూబ్ ఒక్క చుక్క కూడా డ్ర‌మ్ములో ప‌డ‌కుండా దాన్ని త‌ల‌కిందులుగా బోర్లించి డ్ర‌మ్ముపై ఎక్కి కూర్చున్నాడు. కానీ సోహైల్ వ‌చ్చి అత‌డిని నెట్టేసి డ్ర‌మ్మును నీళ్లు నింపేందుకు సిద్ధం చేశాడు. హోరాహోరీగా జ‌రుగుతున్న ఈ ఫైట్‌లో మంచి మ‌నుషులే విజ‌యం సాధించిన‌ట్లు తెలుస్తోంది. ముగ్గురు రాక్ష‌సుల‌ను మంచి మ‌నుషులుగా మ‌ర్చితే వారే గెలుస్తారు. ఇప్ప‌టికే నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌, హారిక‌ను మంచిగా మార్చేశారు. తాజా ప్రోమోలో అవినాష్‌ను కూడా మంచి మ‌నిషిగా మార్చేయ‌డంతో మంచి మ‌నుషుల టీమ్ గెలిచిన‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ ‌: దివి ‘పప్పు’ రీజన్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement