
Ariyana Glory On Avinash Engagement: ముక్కు అవినాష్ జబర్దస్త్ కార్యక్రమంతో మంచి గుర్తింపే కాకుండా బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ నటుడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బిగ్‌బాస్ బ్యూటీ అరియాన గ్లోరీ స్పందించింది.
బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్, అరియానతో చనువుగా ఉండటం, ఈ షో అయ్యాక కూడా తరచూ వీరు కలిసి ఈవెంట్స్ చేయడం, గోవా ట్రిప్‌లు, వీడియోలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు వచ్చాయి. అయితే అవినాష్ తన పెళ్లి వార్తతో ఆ పుకార్లకు బ్రేక్ వేశాడు. ఇక దీనిపై అరియాన.. అవినాష్ పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా మధ్య ఏదో ఉందని చాలా పుకార్లు ఉన్నాయి కానీ అలాంటిదేమీ లేదు.
తను నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అవినాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’..అని క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న అరియాన బాగా డబ్బు సంపాదించి, సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని తెలిపింది.
చదవండి: Tollywood Drug Case: అమ్మతోడు ఈడీ కార్యాలయానికి అందుకే వచ్చా: బండ్ల గణేశ్
Comments
Please login to add a commentAdd a comment