ఫ్యామిలీ వీక్‌లో ఏ కంటెస్టెంట్ అయినా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే! కానీ అవినాష్ మాత్రం అక్కడ కూడా నవ్వించాడు. తన భార్య అనూజ సడన్ ఎంట్రీతో షాకైన అవినాష్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇద్దరికీ సెపరేట్‌గా డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న గదిని బెలూన్లతో నింపేశాడు.
బిగ్‌బాస్ సర్‌ప్రైజ్
ఆ సెటప్ చూసి అవినాష్‌కు దిమ్మతిరిగిపోయింది. ఇది జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు. అయితే అనూజ వచ్చినప్పుడు లైట్లు ఆఫ్ చేయమని అవినాష్ ఇటీవలే సరదాగా బిగ్‌బాస్‌తో అన్నాడు. కానీ ఆ పెద్దాయన ఇది సీరియస్‌గా తీసుకుని నిజంగానే వీళ్లున్న గదిలో లైట్లు ఆఫ్ చేశాడు. దీంతో అవినాష్ తెగ సిగ్గుపడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment