Jabardasth Avinash Says His Wife Anuja Pregnant - Sakshi
Sakshi News home page

Mukku Avinash: గుడ్‌న్యూస్‌ చెప్పిన జబర్దస్త్‌ అవినాష్‌, త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్‌..

Published Sat, Jul 8 2023 7:08 PM | Last Updated on Sat, Jul 8 2023 7:37 PM

Jabardasth Avinash Says His Wife Anuja Pregnant - Sakshi

ముక్కు అవినాష్‌.. ఇతడు ఎక్కడుంటే అక్కడ నవ్వుల పంట పండాల్సిందే! ఏ షోలో అడుగుపెట్టినా 100% ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తాడు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఇతడు జబర్దస్త్‌ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ రియాలిటీ షోలోనూ అడుగుపెట్టి మరింత ఫేమస్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ద హౌస్‌గా పేరు తెచ్చుకున్నాడు.

తన భార్యతో కలిసి రియాలిటీ షోలు కూడా చేసిన అవినాష్‌ తాజాగా ఓ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. త్వరలో తాము పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందబోతున్నామని శుభవార్త తెలిపాడు. ఈ మేరకు ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. 'నా భార్య అనూజ ప్రెగ్నెంట్‌. మా ఇంట్లోకి బాబు లేదా పాపాయి రాబోతోంది. మా పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. అక్టోబర్‌లో మా పెళ్లి రోజు. పిల్లల్నెప్పుడు కంటారు? అని మమ్మల్ని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పాం.

పెళ్లైన ఏడాదిన్నరకే మేము తల్లిదండ్రులం కాబోతుండటం ఆనందంగా ఉంది. మూడు నెలల వరకు ఎవరికీ చెప్పొద్దని వైద్యులు సలహా ఇచ్చారు. ఇప్పుడు తనకు నాలుగో నెల. అందుకే ఇన్నాళ్లకు ఈ విషయం బయటకు చెప్తున్నాం. మా కంటే కూడా మా అమ్మానాన్న, అత్తామామలు సంతోషంగా ఫీలయ్యారు. నాలుగో నెలలో బేబీ గుండెచప్పుడు కూడా విన్నాం. అప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను' అని ఆనందం వ్యక్తం చేశాడు అవినాష్‌.

చదవండి: ప్రియుడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. నాన్నకు తెలిసి గుండెపోటు: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement