బిగ్‌ బాస్‌ : సీక్రెట్‌ టాస్క్‌ అవినాష్‌ కొంప ముంచేనా? | Bigg Boss 4 Telugu : Avinash May Loss Good Name Due To Secret Task | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ : సీక్రెట్‌ టాస్క్‌ అవినాష్‌ కొంప ముంచేనా?

Published Wed, Oct 7 2020 6:08 PM | Last Updated on Wed, Oct 7 2020 8:34 PM

Bigg Boss 4 Telugu : Avinash May Loss Good Name Due To Secret Task - Sakshi

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకుంది. వైల్డ్‌ కార్డుల ఎంట్రీలు, ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ, చిన్న చిన్న గొడవలతో ఇప్పటి వరకు షో కొనసాగుతూ వచ్చింది. ఇక గతంలో షో మొదలైన కొద్ది రోజులకే కంటెస్టెంట్స్‌కి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చి గొడవలు పెట్టేవాడు బిగ్‌బాస్‌. కానీ సీజన్‌ 4లో మాత్రం నెల రోజుల తర్వాత సీక్రెట్‌ టాస్క్‌ వచ్చింది. అదీ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటున్న అవినాష్‌ మెడకు పడింది. వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన అవినాష్‌.. తొలిరోజు నుంచి హౌస్‌మేట్స్‌ అందరితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అతని మంచితనం కారణంగానే ఆయన ఇంత వరకు ఒక్కవారం కూడా ఎలిమినేషన్‌కు నామినేట్‌ కాలేదు. అతని కామెడీ టైమింగ్‌, మిమిక్రీకి కంటెస్టెంట్స్‌ అంతా ఫిదా అయ్యారు. దీంతో అవినాష్‌ను ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడంతో లేదు. ఇది గమనించిన బిగ్‌ బాస్‌.. అవినాష్‌ని ఎలాగైన రిస్క్‌లో పెట్టాలని భావించినట్లున్నాడు. అందుకే అతనికి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చి ఇబ్బంది పెట్టాడు.
(చదవండి : బిగ్‌ బాస్‌: అతిథుల టార్చర్‌.. కుప్పకూలిన అభిజిత్‌)

బీబీ హోటల్‌ టాస్క్‌లో భాగంగా అవినాష్‌ సీక్రెట్‌ టాస్క్‌ చేయాల్సి ఉంది. హోటల్‌ సిబ్బందిగా ఉంటూనే.. వారికి స్టార్స్‌ రాకుండా చేయడం అవినాష్‌ పని. అందులో భాగంగా అవినాష్‌ ఇప్పటికే అతిథులైన హారిక, అరియానాను ఇరిటేట్‌ చేశాడు. గెస్ట్‌గా వచ్చిన తనను పట్టించుకోకుండా అరియానా రాగానే ఆమెవైపు వెళ్లడంతో అవినాష్‌పై హారిక కోపం పెంచుకుంది. అయితే సీక్రెట్‌ టాస్క్‌లో ఇది భాగమని హారికకు తెలియదు. అలాగే యువరాణి అయిన అరియానాను కావాలని రెచ్చగొడుతున్నాడు. తన పంచ్‌లతో, చేష్టలతో అరియానాకు చిరాకు తెప్పిస్తున్నాడు.

అలాగే అతిథుల కోసం చేసిన వంటలలో ఉప్పు వేసి చెడగొట్టాడు. ఇవన్ని చూస్తూంటే అవినాష్‌కు ఇకపై ఇంట్లో పోరు తప్పదనిపిస్తుంది. సీక్రెట్‌ టాస్క్‌ ముగిసేలోపు అవినాష్‌కు అందరితోనూ గొడవలు జరిగేలా ఉన్నాయి. ఈ ఎఫెక్ట్‌ వచ్చేవారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో కచ్చితంగా ఉంటుంది. ఇంటి సభ్యులంతా అవినాష్‌ను టార్గెట్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఇది సీక్రెట్‌ టాస్క్‌ అని తెలిస్తే కొంతమంది అవినాష్‌ను తప్పపట్టకపోవచ్చు. ఏదిఏమైనా అవినాష్‌కు ఉన్న ‘మంచి’పేరు సీక్రెట్‌ టాస్క్‌తో పోతుందనే చెప్పాలి. సీక్రెట్‌ టాస్క్‌ ఎఫెక్ట్‌తో వచ్చే వారం ఎలిమినేషన్‌ అయ్యేవారిలో అవినాష్‌ కూడా ఉంటాడని కొంతమంది భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement