నయనతార, విఘ్నేశ్ శివన్‌లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షాకిచ్చిందని, వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందంటూ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నయన్ దంపతులకు నోటీసులు కూడా ఇచ్చిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది నెట్‌ఫ్లిక్స్.
చదవండి: కొత్త ఇంటికి మారిన హిమజ, హోంటూర్ వీడియో వైరల్
నయనతార-విఘ్నెశ్ శివన్‌లకు సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేస్తూ వీరి పెళ్లి డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌పై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నయన్ విఘ్నేశ్‌ల ఫొటోలను షేర్ చేస్తూ ‘త్వరలోనే నయనతార, విఘ్నేశ్‌లు మా నెట్‌ఫ్లిక్స్‌కి రాబోతున్నారు. అప్పటి వరకు ఈ ఫొటోలు చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ పోస్ట్ షేర్ చేసింది. కాగా గత జూన్ 9వ తేదీన నయన్-విఘ్నేశ్‌లు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమిళనాడు మహాబలిపురంలోని షేర్టన్ గార్డెన్ వేదికగా వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం సినీ ప్రముఖులు, అంత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా ఈ జంట పెళ్లి జరిగింది.
చదవండి: మీ టూ నిందితులు వేధిస్తున్నారు: తనుశ్రీ దత్త షాకింగ్ పోస్ట్
ఇక సినీ ప్రముఖుల రాకతో వీరి పెళ్లి వేదిక కళకళలాడింది. వీరి పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను నెట్‌ఫ్లిక్స్ డాక్యూమెంటరి రూపంలో అందించేందుకు ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంటరిని స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, రౌడీ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ డాక్యుమెంటరీలో నయన్-విఘ్నేష్‌ల ప్రేమ ప్రయాణం, అక్కడి నుండి వారి పెళ్లి వరకు చోటు చేసుకున్న పరిణామాలను ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment