
నేను ఓడిపోయాను అని నటి నయనతార తన ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఇప్పుడిది పెద్ద చర్చకి దారి తీస్తోంది. లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న బహుభాషా నటి నయన తార. నాలుగు పదుల వయసులోనూ అగ్రకథా నాయకిగా రాణిస్తూ అత్యధిక పారితోషికం పు చ్చుకుంటున్న నటి ఈమె. ఇటీవల జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈ సంచలన నటికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె తమిళంలో శశికాంత్ దర్శకత్వంలో టెస్ట్, యూ ట్యూబర్ డ్యూడ్ విక్కీ దర్శకత్వంలో మన్నాంగట్టి, తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఎల్‌ఐసీ, దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.
అదే విధంగా తన భర్తతో కలిసి చిత్ర నిర్మాణం చేపట్టారు. మరో పక్క ఇతర వ్యాపార రంగాలలోనూ బిజీ గా వున్నారు. కాగా 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే సరోగసి విధానం ద్వారా ఈ జంట ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. వీరికి సంబంధించిన ఫొటోలను నయనతార తరచూ తన ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కాగా సమీప కాలంలో ఆమె తన భర్త విఘ్నేష్ శివన్‌ను అన్‌పాలో చేస్తూ చేసిన పోస్టు పెద్ద చర్చకే దారి తీసింది.
దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ ఇద్దరు విడిపోబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. దీనికి ఆజ్యం పోసే విధంగా తాజాగా నటి నయనతార నేను ఓడిపోయాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొనడం మరింత అలజడికి దారి తీస్తోంది. దీంతో విఘ్నేష్ శివన్, నయనతారల మధ్య అసలు ఏం జరుగుతోంది? నయనతార ఇలా పోస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఇదంతా వాస్తవమా? లేక ఏదైనా ఒక ప్రకటనలో భాగమా..? అనే చర్చ కోలీవుడ్‌లో జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment