నయనతార- విఘ్నేశ్ శివన్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే స్టార్ కపుల్. నయనతార హీరోయిన్‌గా నటించిన నానుమ్ రౌడీ దాన్ (2015) సినిమాకు విఘ్నేశ్ (విక్కీ) దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో నేను రౌడీ అనే టైటిల్ పేరిట రిలీజైంది. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022 జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సరోసగి ద్వారా ఉయిర్, ఉలగం అని ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులయ్యారు.
ఇకపోతే వీరి మధ్య లవ్ పుట్టడానికి ఓ స్టార్ హీరో కారణమంటున్నాడు విక్కీ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానుమ్ రౌడీ ధాన్ కథ నయనతారకు చెప్పమని ధనుష్ సరే సూచించాడు. అలా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది. మొదట్లో ఈ స్క్రిప్ట్ నచ్చలేదన్న విజయ్ సేతుపతి నయన్ ఓకే చేసిందనగానే తను కూడా సంతకం చేశాడు. ఈ సినిమా వల్ల నయన్‌కు ఎక్కువ సమయం కేటాయించాను. తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాం. ఒకరకంగా మా ప్రేమకు ధనుషే కారణమయ్యాడు' అని చెప్పాడు. నానుమ్ రౌడీ ధాన్ మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment