నయనతారకు లీగల్ నోటీసులు పంపిన ధనుష్‌పై ఆమె భర్త విఘ్నేష్ శివన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికి తప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. ధనుష్ అభిమానులు అతని అసలు ముఖం ఎంటో తెలుసుకోవాలని ఒక ఆడియో క్లిప్‌ను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు. దీంతో అది నెట్టింట వైరల్ అవుతుంది.
ధనుష్ పంపిన లీగల్ నోటీసును విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనుష్ మాట్లాడిన ఒక పాత వీడియోను కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో ధనుష్ ఇలా అన్నారు 'ఒకరిపై ప్రేమ మరొకరిపై ద్వేషంగా మారుతుంది. అది అలా ఎందుకు మారుతుందో అర్థం కాదు. ప్రపంచం నేడు అత్యంత అధ్వాన్నంగా ఉంది. మంచివాడే ఎవరినీ ఇష్టపడడు. మీరు జీవించండి, జీవించనివ్వండి. ఎవరూ ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు.' అని అన్నారు.
మంచివాళ్ళంటే ధనుష్‌కు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించిన ఆయన పాత వీడియోను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. ధనుష్ అభిమానులను ప్రస్తావిస్తూ కూడా విఘ్నేష్ పలు వ్యాఖ్యలు చేశారు. 'మీరందరూ అనుకున్నట్లు ధనుష్ అంత మంచివాడు కాదు. ఈ విషయాన్ని తెలుసుకుంటారని నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.' అని తెలిపారు. ఆపై ధనుష్ కోరిన రూ. 10 కోట్ల విలువగల వీడియో ఇదేనంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విఘ్నేష్ షేర్ చేశారు.
(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ)
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నయనతార.. సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేంత స్థాయికి చేరుకున్నారు. ఆపై ఆమే ప్రేమించి విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోవడం ఆపై ఇద్దరు పిల్లలతో ఆమె సక్సెస్‌ఫుల్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఆమె డాక్యుమెంటరీని తెరకెక్కించింది. నవవంబర్ 18న విడుదల కానుంది. అయితే, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'నేనూ రౌడీనే' అనే చిత్రం నుంచి 3 సెకండ్ల వీడియోను వారు ఉపయోగించుకున్నారు. కాపీ రైట్స్ హక్కుల పరంగా ధనుష్ ఏకంగా రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ వారికి నోటీసులు పంపారు. ఈ చిత్రంలో నయన్ నటించిగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచే వారిద్దరూ ప్రేమలో పడటం ఆపై పెళ్లి చేసుకోవడంతో ఆ 3 సెకండ్ల వీడియోను ఉపయోగించుకున్నట్లు నయన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment