కేరళకు భారీ సాయం ప్రకటించిన 'నయనతార' దంపతులు | Nayanthara And Vignesh Shivan Big Help To Kerala Wayanad Landslides Victims, Post Goes Viral | Sakshi
Sakshi News home page

కేరళకు భారీ సాయం ప్రకటించిన 'నయనతార' దంపతులు

Published Fri, Aug 2 2024 4:42 PM | Last Updated on Fri, Aug 2 2024 6:26 PM

Nayanthara And Vignesh Shivan Big Help To Kerala

స్టార్‌ హీరోయిన్‌ నయనతార- విగ్నేష్‌ శివన్‌ దంపతులు మంచు మనసు చాటుకున్నారు.  కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో వేల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల వల్ల తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి ఇప్పుడు వయనాడ్‌లో కనిసిస్తుంది. జల ప్రళయం వల్ల ఇప్పటి వరకు సుమారు 300 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. కేరళ ప్రజలను ఆదుకునేందకు ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. తాజాగా నయనతార దంపతులు కూడా తమ వంతుగా కేరళ కోసం విరాళం ప్రకటించారు.

కేరళకు జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తి చేయలేరంటూ నయనతార భర్త విగ్నేష్‌ శివన్‌ ఒక నోట్‌ విడుదల చేశారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తమ వంతుగా రూ. 20 లక్షలు అందిస్తున్నట్లు అందులో వారు పేర్కొన్నారు. కేరళ ప్రజల కష్టాలను చూస్తుంటే కన్నీటితో తమ గుండె బరువెక్కుతుందని వారు తెలిపారు. కేరళ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు అంటూ నయనతార దంపతులు తెలిపారు. 

సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు... విక్రమ్ రూ. 20 లక్షలు, మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్‌ రూ. 15 లక్షలు,ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు రూ.25 లక్షలు, రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement