Vignesh Shivan Shares Wedding Pics And His Love Story With Nayanthara - Sakshi
Sakshi News home page

Vignesh Shivan-Nayanthara: నెట్టింట ట్రెండ్‌ అవుతున్న నయన్‌, విఘ్నేశ్‌ పెళ్లి ఫొటోలు

Published Thu, Jun 9 2022 9:01 PM | Last Updated on Fri, Jun 10 2022 8:58 AM

Vignesh Shivan Shares Wedding pics And His Love Story With Nayanthara - Sakshi

ఎట్టకేలకు నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ ఒక్కటయ్యారు. ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట గురువారం(జూన్‌ 9) వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. నాను రౌడీదాన్‌ షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ ఈ లవ్‌ బర్డ్స్‌ గత లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఈ మధ్య అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చిన ఈ జంట ఈరోజు తమ జీవితంలో పెళ్లి పుస్తకాన్ని తెరిచారు. ఎంతగానో ఆరాధించే నటుడు రజనీకాంత్‌ చేతుల మీదుగా అందుకున్న మంగళ సూత్రాన్ని విఘ్నేశ్‌ తన ప్రియసఖి నయనతార మెడలో మూడు ముళ్లు వేశాడు.

ఈ సందర్భంగా విఘ్నేశ్‌ సోషల్‌ మీడియాలో తమ ప్రేమ కావ్యాన్ని సింగిల్‌ లైన్‌లోనే అద్భుతంగా చెప్పుకొచ్చాడు. 'నయన్‌ మేడమ్‌ నుంచి కాదంబరి, కాదంబరి నుంచి తంగమే.. తంగమే నుంచి నా బేబీ, నా బేబీ నుంచి నా ఉయిర్‌.. నా ఉయిర్‌ నుంచి కన్మణి, కన్మణి నుంచి ఇప్పుడు నా భార్యగా మారావు' అంటూ లవ్‌ సింబల్‌ ఎమోజీలు పెడుతూ పెళ్లి ఫొటోలు షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తో పాటు వీరి పెళ్లి ఫొటోలు సైతం నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: గ్రాండ్‌గా నయన్‌-విఘ్నేశ్‌ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement