నూతన దంపతులు నయనతార, విఘ్నేశ్ శివన్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థ షాకిచ్చింది. గత నెల 9వ తేదీని నయన్-విఘ్నేశ్‌లు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమిళనాడు మహాబలిపురంలోని షేర్టన్ గార్డెన్ వేదికగా వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం సినీ ప్రముఖులు, అంత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా ఈ జంట పెళ్లి జరిగింది. ఇక సినీ ప్రముఖుల రాకతో వీరి పెళ్లి వేదిక కళకళలాడింది. అయితే పెళ్లి అనంతరం వీరి ఫొటోలు కూడా చాలా అరుదుగా బయటకు వచ్చాయి.
ఇక వీడియోలు అయితే ఎక్కడ కనిపించలేదు. దీనికి కారణంగా వీరి వివాహ మోహోత్సవాన్ని సంబంధించిన వీడియో, ఫొటోలు హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం నయన్ దంపతులకు భారీగా డబ్బు చెల్లించుకుందట నెట్‌ఫ్లిక్స్. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విఘ్నేశ్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారి పెళ్లి జరిగి నెల రోజులు గడిచిన సందర్భంగా విఘ్నేశ్ వరుసగా పలు పెళ్లి ఫొటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ నుంచి పలువురు సినీ ప్రముఖలు పెళ్లికి హాజరై ఆశీర్వదించిన ఫొటోలను విక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఇది చూసి సదరు ఓటీటీ సంస్థ నిరాశ వ్యక్తం చేసిందట. ఒప్పందం ప్రకారం స్ట్రీమింగ్‌కు ముందే పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియో షేర్ చేయకూడదట. కానీ విఘ్నేశ్ అసలైన ఫొటోలను షేర్ చేయడంతో వారి పెళ్లి వీడియోను స్ట్రీమింగ్ చేయకూడదని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుందని కోలీవుడ్‌లో టాక్. అంతేకాదు తమ ఢీల్‌ను రద్దు చేసుకుని, అడ్వన్స్‌గా ఇచ్చిన డబ్బును వెనక్కి ఇచ్చేయాలని నెట్‌ఫ్లిక్స్ నయన్, విఘ్నేశ్‌లకు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో నయన్-విఘ్నెశ్‌ల పెళ్లీ వీడియో, ఫొటోషూట్‌లు నిర్వహించారు.
చదవండి:
వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు
నటుడితో డేటింగ్, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
వైరల్.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్
Comments
Please login to add a commentAdd a comment