Nayanthara Admitted To Hospital After Vomiting, Details Inside - Sakshi
Sakshi News home page

Nayanthara: నయనతారకు వాంతులు, ఎనీ గుడ్‌న్యూస్‌ అంటున్న ఫ్యాన్స్‌!

Aug 10 2022 2:44 PM | Updated on Aug 10 2022 4:09 PM

Nayanthara Admitted To Hospital After Vomiting - Sakshi

తాజాగా నయనతార అస్వస్థతకు గురైందట. ఆమెకు వాంతులు కావడంతో ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ఏదైనా గుడ్‌న్యూసేమో అని

స్టార్‌ హీరోయిన్‌ నయనతార ఇటీవలే ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే! మెడలో మూడు ముళ్లు పడ్డ తర్వాత ఈ కొత్త జంట హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చింది. ఆ వెంటనే నయన్‌ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తాను ఓకే చెప్పిన సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటోంది. అయితే తాజాగా నయనతార అస్వస్థతకు గురైందట. ఆమెకు వాంతులు కావడంతో ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ఏదైనా గుడ్‌న్యూసేమో అని ఊహల్లో తేలిపోతున్నారు.

కానీ విఘ్నేశ్‌ శివన్‌ స్వతాహాగా తయారు చేసిన ఓ వంటకాన్ని ఆరగించడంతో ఆమెకు వాంతులు అయ్యాయని తెలుస్తోంది. దీంతో ఆమె హాస్పిటల్‌కు వెళ్లగా వైద్యులు కొన్నిగంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచి తర్వాత ఆమెను డిశ్చార్జ్‌ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే కొందరు మాత్రం స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్లే ఆమె ఆస్పత్రికి వెళ్లిందని అంటున్నారు. మరి అసలు నిజమేంటన్నది తెలియాలంటే నయన్‌, విఘ్నేశ్‌లలో ఎవరు ఒకరు స్పందించాల్సిందే!

ఇకపోతే నయన్‌- విక్కీల పెళ్లి వీడియో త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న విషయం తెలిసిందే! ఈమేరకు ఇటీవలే టీజర్‌ కూడా రిలీజైంది. వీరి పెళ్లి మహోత్సవాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

చదవండి: 'ఇన్‌స్టాలో బ్లాక్‌ చేసుకున్నాం.. కలిసుండటం ఇక జరగదు'
ఎప్పుడూ మీరే కరెక్ట్‌.. ప్రతిసారి మాదే తప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement