అన్‌ఫాలో.. ఫాలో! | Nayanthara unfollows husband Vignesh Shivan on Instagram | Sakshi
Sakshi News home page

అన్‌ఫాలో.. ఫాలో!

Published Sun, Mar 3 2024 5:59 AM | Last Updated on Sun, Mar 3 2024 12:20 PM

Nayanthara unfollows husband Vignesh Shivan on Instagram - Sakshi

అస్టార్‌ హీరోయిన్‌ నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ప్రేమ వివాహం చేసుకున్న విషయం, కవల పిల్లలు (కుమారులు) ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ దంపతులు అన్యోన్యంగా కనిపిస్తారు. అలాంటిది తాజాగా తన భర్త విఘ్నేష్‌ శివన్‌ను నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాని ప్రారంభించిన నయనతార తక్కువ సమయంలోనే 78 లక్షల మంది ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్నారు.

ఇన్‌స్టాలో విఘ్నేష్‌ని ఫాలో అవుతూ వచ్చిన నయనతార అకస్మాత్తుగా అన్‌ఫాలో అయ్యారు. గత నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున కూడా ‘మా ప్రేమ బంధానికి పదేళ్లు’ అంటూ భర్తతో ఉన్న ఫొటోలు షేర్‌ చేసిన నయనతార ఇప్పుడు ఇలా అన్‌ఫాలో కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే సాంకేతిక కారణాల వల్లే అలా జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా అన్‌ఫాలో వార్త వైరల్‌ అయిన కొంత సమయానికి తిరిగి విఘ్నేష్‌ని ఫాలో అయ్యారు నయనతార.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement