
సౌత్ ఇండియాలో నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్ నయనతార. ఆమె సినీ పయనం ఒక సంచలనం. అవమానాలు, ఆరోపణలు, వివాదాలమయ జీవితం. అయితే అందులోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ అకుంఠిత శ్రమతో నంబర్ వన్ నటి అనే అంతస్తులో నిలిచారు. సూపర్ స్టార్‌గా అత్యంత అధిక పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ నాయకిగా రాణిస్తున్నారు. రెండు మూడు సార్లు ప్రేమలో ఓడిపోయి చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమను పొంది, ఆయనతో గత రెండేళ్ల క్రితం ఏడు అడుగులు వేశారు.
ఇప్పుడు వీరికి ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కథానాయకిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న నయనతార తనకు సంబంధించిన సినీ, వ్యక్తిగత విషయాలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేయడంతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పదమైన విషయాలను పొందుపరుస్తూ షాకింగ్‌కు గురి చేస్తుంటారు. భర్త విగ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్, ఉలగంతో ఎంతో అన్యోన్యంగా ఉండే నయనతార ఇటీవల తాను ఓడిపోయాను అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో చేసిన పోస్ట్ అందరిని షాక్‌కు గురి చేసింది.
దర్శకుడు విగ్నేశ్ శివన్‌తో మనస్పర్థలా? ఇద్దరు విడిపోతున్నారా? అసలు వీరి మధ్య ఏం జరుగుతోంది? అంటూ పలు ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే తన భర్త పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. దీంతో అదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. కాగా నయనతార విగ్నేష్ శివన్ విడిపోతారనే పదానికే తావు లేదని విశ్లేషకులు అంటున్నారు. నయనతార ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టించడానికి సలహాలు ఇచ్చిందే విగ్నేష్ శివన్ అని, ఎంతో కష్టపడి కూడబెట్టిన ఆస్తులు, చేస్తున్న వ్యాపారాలకు ఆమె భర్త విగ్నేష్ శివన్ ఫౌండర్‌గానో, కో ఫౌండర్‌గానో ఉన్నారని, కాబట్టి విడిపోయే ఛాన్సే లేదని విశ్లేషకులు చెబుతున్న మాట.
Comments
Please login to add a commentAdd a comment