
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది షారుక్ సరసన జవాన్‌తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె నటించిన అన్నపూరణి పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో ఓ వర్గం వారిని కించపరిచేలా సీన్స్ ఉన్నాయంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీ నుంచి తొలగించింది.
అయితే ఇటీవల నయన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన భర్తను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడంతో పెద్ద ఎత్తున రూమర్స్ మొదలయ్యాయి. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట విడిపోనుందా? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ అంతలోనే మళ్లీ తన భర్తను ఫాలో చేసింది. దీంతో ఈ జంట విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టింది.
కానీ తాజా పరిణామాలతో వాటికి చెక్ పెడుతూ.. విఘ్నేశ్ శివన్ ఆమె ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్స్‌కు తెరపడింది. కాగా.. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా.. గత నెల ప్రేమికుల రోజు నయనతార.. తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment