ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. నయన్ భర్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Koozhangal Movie OTT Release Vignesh Shivan Comments | Sakshi
Sakshi News home page

థియేటర్‌లో రిలీజ్ అనుకున్నారు.. కానీ అలా జరగడంతో ఓటీటీలో!

Published Sun, Oct 29 2023 4:41 PM | Last Updated on Sun, Oct 29 2023 5:12 PM

Koozhangal Movie OTT Release Vignesh Shivan Comments - Sakshi

రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన సినిమా 'కూళంగల్‌'. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరుత్తడైయాన్‌, చెల్లపాండి ప్రధానపాత్రులు పోషించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందించాడు. నయనతార, విఘ్నేశ్ శివన్‌ నిర్మాతలు. తమిళనాడు, తంజావూర్‌లోని ఓ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన చిత్రమిది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మ్యాడ్' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన ఈ సినిమా అక్టోబరు 27న సోనీ లివ్ ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత విఘ్నేశ్ శివన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూడగానే చాలా నచ్చిందని, తమకు ఎంతో ఘనత తెచ్చిపెట్టిన చిత్రం ఇదని అన్నాడు. 

ఈ మూవీని థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నామని కానీ సమయం గడిచిపోతుండడంతో సోనీ లివ్ ఓటీటీలో విడుదల చేసినట్లు విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు. కాగా దర్శకుడు వినోద్‌ రాజ్‌తో కలిసి మరో చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నాయని విఘ్నేష్‌ శివన్‌ పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement