Pebbles
-
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. నయన్ భర్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన సినిమా 'కూళంగల్'. పీఎస్ వినోద్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరుత్తడైయాన్, చెల్లపాండి ప్రధానపాత్రులు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. నయనతార, విఘ్నేశ్ శివన్ నిర్మాతలు. తమిళనాడు, తంజావూర్‌లోని ఓ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన చిత్రమిది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మ్యాడ్' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన ఈ సినిమా అక్టోబరు 27న సోనీ లివ్ ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత విఘ్నేశ్ శివన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూడగానే చాలా నచ్చిందని, తమకు ఎంతో ఘనత తెచ్చిపెట్టిన చిత్రం ఇదని అన్నాడు. ఈ మూవీని థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నామని కానీ సమయం గడిచిపోతుండడంతో సోనీ లివ్ ఓటీటీలో విడుదల చేసినట్లు విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు. కాగా దర్శకుడు వినోద్ రాజ్‌తో కలిసి మరో చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నాయని విఘ్నేష్ శివన్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్
శుక్రవారం వచ్చిందంటే చాలు సాఫ్ట్వేర్ బిడ్డలు రిలాక్స్ అయిపోతారు. కాలేజీ పోరలు చిల్ అవుతారు. మూవీ లవర్స్ మాత్రం కొత్తగా ఏ సినిమా వచ్చిందా? దాన్ని ఎప్పుడు చూద్దామా అని అనుకుంటూ ఉంటారు. అలా చూసుకుంటే ఈ వారం థియేటర్లలోకి వచ్చేవాటిలో సంపూ 'మార్టిన్ లూథర్‌కింగ్' సినిమా తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ మూవీస్ లేవు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఇకపోతే ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చంద్రముఖి 2, పెబ్బల్స్, చాంగురే బంగారు రాజా అనే తెలుగు సినిమాలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని ఇంగ్లీష్, హిందీ వెబ్ సిరీసులు కూడా రాబోతున్నాయి. ఇంతకీ అవి ఏయే ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయనేది కింద లిస్ట్ ఉంది చూసేయండి. ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27) నెట్‌ఫ్లిక్స్ పెయిన్ హజ్లర్స్ - ఇంగ్లీష్ సినిమా సిస్టర్ డెత్ - స్పానిష్ చిత్రం టోర్ - స్వీడిష్ సిరీస్ ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ - కొరియన్ సినిమా కాస్ట్ ఎవే దివా - కొరియన్ సిరీస్ చంద్రముఖి 2- తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్) క్రాషింగ్ ఈద్ - అరబిక్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ఇరైవన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్) లాంగ్ లివ్ లవ్ - థాయ్ చిత్రం (స్ట్రీమింగ్) వన్ ఫోర్: ఎగైనెస్ట్ ఆల్ ఆడ్స్ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్) ప్లూటో - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్) అమెజాన్ ప్రైమ్ కన్సక్రేషన్ - ఇంగ్లీష్ మూవీ సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ - జర్మన్ సిరీస్ (స్ట్రీమింగ్) ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్) ఆహా యారో - తమిళ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కాఫీ విత్ కరణ్ సీజన్ 8 - హిందీ టాక్ షో (స్ట్రీమింగ్) సోనీ లివ్ పెబ్బల్స్ - తమిళ మూవీ జీ5 నికోంజ్ - ద సెర్చ్ బిగిన్స్ - బెంగాలీ చిత్రం ఈ విన్ చాంగురే బంగారు రాజా - తెలుగు సినిమా లయన్స్ గేట్ ప్లే కాబ్ వెబ్ - ఇంగ్లీష్ సినిమా ఆపిల్ ప్లస్ టీవీ కర్సస్! - ఇంగ్లీష్ సిరీస్ ద ఎన్ఫీల్డ్ పోల్టర్‌గిస్ట్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!) -
ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు
మరోవారం వచ్చేసింది. దసరా సందర్భంగా గతవారం థియేటర్లలోకి వచ్చిన లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. దీంతో అందరూ దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. వీటిలో కొత్త మూవీస్ ఏమొచ్చాయి? వాటిలో ఏం చూద్దామనే తాపత్రయంతో ఉంటారు. అలా ఈవారం 28 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: గేమ్ పేరు చెప్పి మోసం? నవ్వుతున్నారనే సోయి లేకుండా!) దాదాపు 28 వరకు ఓటీటీల్లోకి వస్తున్నాయి. అయితే వీటిలో చంద్రముఖి 2, స్కంద, చాంగురే బంగారు రాజా సినిమాలతో పాటు మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్ ఆసక్తిగా అనిపిస్తుంది. వీటితోపాటు పలు హిందీ, ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఓవరాల్ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్-వెబ్ సిరీస్ జాబితా (అక్టోబరు 23-29) అమెజాన్ ప్రైమ్ పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24 ఏస్ప్రింట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 25 ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ద బీస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 26 కన్సక్రేషన్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27 నెట్‌ఫ్లిక్స్ బర్నింగ్ బిట్రేయల్ (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 25 లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 25 చంద్రముఖి 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 26 లాంగ్ లివ్ లవ్ (థాయ్ సినిమా) - అక్టోబరు 26 ప్లూటో (జపనీస్ సిరీస్) - అక్టోబరు 26 పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27 సిస్టర్ డెత్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 27 టోర్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబరు 27 ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ (కొరియన్ సినిమా) - అక్టోబరు 27 కాస్ట్ ఎవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 28 సోనీ లివ్ పెబ్బల్స్ (తమిళ సినిమా) - అక్టోబరు 27 ఆహా పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24 ఈ-విన్ చాంగురే బంగారు రాజా (తెలుగు మూవీ) - అక్టోబరు 27 జియో సినిమా ఫోన్ కాల్ (హిందీ సినిమా) - అక్టోబరు 23 జీ5 దురంగ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 24 నికోంజ్ - ద సెర్చ్ బిగిన్స్ (బెంగాలీ సినిమా) - అక్టోబరు 27 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మాస్టర్ పీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 25 కాఫీ విత్ కరణ్ సీజన్ 8 (హిందీ టాక్ షో) - అక్టోబరు 26 స్కంద (తెలుగు సినిమా) - అక్టోబరు 27 హెచ్ఆర్ ఓటీటీ నడికలిల్ సుందరి యమున (మలయాళ సినిమా) - అక్టోబరు 23 బుక్ మై షో నైట్స్ ఆఫ్ జొడాయిక్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 24 లయన్స్ గేట్ ప్లే కాబ్ వెబ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27 ఆపిల్ ప్లస్ టీవీ కర్సెస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27 ద ఎన్ఫీల్డ్ పొల్టర్గిస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27 (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) -
అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి
థియేటర్లలో రిలీజైన సినిమాలు మహా అయితే నెల, అది కాదంటే ఓ రెండు నెలల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్న రోజులివి. అలాంటిది రెండేళ్ల క్రితం తీసి, పలు అవార్డులు దక్కించుకున్న ఓ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అందరూ ఈ మూవీపై ఆసక్తి పెరుగుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలోకి రానుంది? సినిమా సంగతేంటి? సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా అద్భుతమైన క్రేజ్. మరోవైపు భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. వీళ్లిద్దరూ కలిసి ఓ నిర్మాణ సంస్థ కూడా స్థాపించారు. అలా తీసిన సినిమానే 'పెబ్బల్స్'. 2021లో పలు అవార్డులు దక్కించుకుని.. గతేడాది ఆస్కార్‌కి నామినేట్ కూడా అయింది. ఆస్కార్ రాకపోయినా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు మాత్రం దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమానే అక్టోబరు 27న సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) సినిమా కథేంటి? వేలు (చెల్లపాండి) స్కూల్‌కి వెళ్లే కుర్రాడు. ఇతడి తండ్రి (కరుత్తాడియన్) తాగుబోతు. ఇతడి తాగుడు తట్టుకోలేక భార్య, తన కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది. దీంతో భార్య, కూతురిని తీసుకొచ్చేందుకు కొడుకుని తీసుకుని తండ్రి వెళ్తాడు. అలా తండ్రి-కొడుకు కలిసి చేసిన ఈ జర్నీలో ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు? చివరకు వేలు.. తల్లి-చెల్లిని కలిశాడా? వాళ్లని ఇంటికి తీసుకొచ్చాడా లేదా అనేదే మెయిన్ పాయింట్. దర్శకుడు పీఎస్ వినోద్ రాజ్ ఈ సినిమా తీశారు. 2015లో ఇతడి అక్కని, బావ ఇంట్లో నుంచి బయటకు తోసేశాడు. దీంతో దాదాపు 13 కిలోమీటర్ల నడిచొచ్చిన ఆమె, పుట్టింటికి చేరుకుంది. ఈ సంఘటన తర్వాత 'పెబ్బల్స్' ఆలోచన వచ్చింది. ఈ మూవీ చాలా రియలిస్టిక్‌గా ఉండటం, కొన్ని గగుర్పాటు కలిగించే సీన్లు ఉన్నప్పటికీ మనసుని హత్తుకుంటుంది. 2021లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు గానీ థియేటర్లలో రిలీజ్ చేయలేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొస్తుండటంతో మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) The journey of this father and son is waiting to touch your heart. Catch this Award-winning movie on #SonyLIV from Oct 27. #Koozhangal #KoozhangalOnSonyLIV #Pebbles @PsVinothraj @VigneshShivN @NayantharaU @Rowdy_Pictures @ParthiDOP@thisisysr @thecutsmaker @Hari_pebbles pic.twitter.com/dRlGmyQEUw — Sony LIV (@SonyLIV) October 21, 2023 -
ఆస్కార్ తుది జాబితాలో ‘కూళాంగల్’ ఉంటుంది: విఘ్నేష్
సాక్షి, చెన్నై: కూళాంగల్ చిత్రం ఆస్కార్ అవార్డుల తుది జాబితాలో ఉంటుందనే నమ్మ కాన్ని దర్శకుడు విఘ్నేష్ శివన్ వ్యక్తం చేశారు. ఈయన, నటి నయనతార కలిసి రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కూళాంగల్. ఇక ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పీఎస్.వినోద్ రాజ్‌కు.. దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. కాగా, చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకుంది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డుల ఎంపికకు నామినేట్ అయ్యింది. ఈ ఏడాది విదేశీ చిత్రాల కేటగిరీలో భారతదేశం తరఫున నామినేట్ అయిన చిత్రం కూళాంగల్. ఆస్కార్ అవార్డుల తుది జాబితాలో తమ చిత్రం ఉంటుందనే నమ్మకాన్ని దర్శకుడు విఘ్నేష్ శివన్ ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. చదవండి: చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్.. ఫిబ్రవరిలో షూటింగ్ -
భారత మార్కెట్ లోకి పెబెల్
నాలుగు మోడళ్ల ఆవిష్కరణ అమెజాన్‌తో జట్టు న్యూఢిల్లీ: స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ పెబెల్ దేశీ వేరబుల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సంస్థ తాజాగా నాలుగు స్మార్ట్‌వాచ్ మోడళ్లను మార్కెట్లో ఆవిష్కరించింది. క్లాసిక్, టైమ్, టైమ్ స్టీల్, టైమ్ రౌండ్ అనే వీటి ధరలు రూ.5,999-రూ.15,999 శ్రేణిలో ఉన్నాయి. వీటి విక్రయాల కోసం సంస్థ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొత్త స్మార్ట్‌వాచ్‌లు ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్ఫోన్లలో పనిచేస్తాయని సంస్థ తెలిపింది.