నయనతార.. సౌత్‌లో టాప్ హీరోయిన్, విఘ్నేశ్ శివన్.. కోలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటి గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. మొన్నటి ప్రేమికుల రోజున కూడా మా ప్రేమ బంధానికి పదేళ్లు అంటూ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసింది. నయనతార గతేడాదే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి భర్త విక్కీని ఫాలో అవుతూ వచ్చింది. కానీ సడన్‌గా ఇప్పుడు అతడిని అన్‌ఫాలో చేసింది.
కన్నీటితో కూడా అదే మాట..
కన్నీళ్లు ఉబికి వస్తున్నప్పుడు కూడా.. ఇదే నాకు మిగిలిందని ఆమె చెప్పడం మానదు అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అయితే జంటగా కలిసున్న ఫోటోలు మాత్రం ఇద్దరి సోషల్ మీడియా ఖాతాలో అలాగే ఉన్నాయి. దీంతో పొరపాటున అన్‌ఫాలో అయ్యారేమోనని కొందరు అభిప్రాయపడుతుండగా.. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు మొదలయ్యాయా? ఎంతో ఆప్యాయంగా ఉండే వీరు కూడా విడిపోతారా? అసలేం జరిగింది? అంటూ తల పట్టుకుంటున్నారు.
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ
కానీ అంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిందీ బ్యూటీ. ఈ వార్త అంతటా పాకేలోపు ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను మళ్లీ ఫాలో అయింది. ఇది చూసిన అభిమానులు హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకపోతే నయనతార గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లకు పైగా రాబట్టింది. తర్వాత ఆమె నటించిన అన్నపూరణి సినిమా ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. ప్రస్తుతం టెస్ట్ సినిమాలో నటిస్తోంది.
చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ..
Comments
Please login to add a commentAdd a comment