లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌లకు టైమ్ అస్సలు బాగోలేనట్లుంది. కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రం తరువాత విఘ్నేశ్ ఇప్పటి వరకు మరో చిత్రం చేయలేదు. ఆ మధ్య అజిత్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం చాలా సమయం వెచ్చించారు. అయితే చివరి క్షణంలో ఆ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది.
నయనతారకు అక్కగా..
ఈ మధ్యే లవ్‌టుడే చిత్రం ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్‌కు అక్కగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిని 7 స్క్రీన్స్ స్టూడియోస్ పతాకంపై లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజాకార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఇక ఈ చిత్ర టైటిల్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే!
వివాదాస్పదంగా అన్నపూరణి
ఎల్‌ఐసీ సంస్థ.. తమ ఖాతాదారుల నమ్మకాన్ని పొందిన ఈ టైటిల్ చిత్రానికి ఉపయోగించరాదని నిర్మాతకు నోటీసులు పంపింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన చిత్రానికి టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక నయనతార విషయానికి వస్తే ఈమె నటించిన తన 75వ చిత్రం అన్నపూరణి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అంతేకాకుండా చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారడంతో సినిమాపై కేసు నమోదైంది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ను నిలిపేసింది.
అంత డబ్బు ఇచ్చుకోలేక..
ఇవన్నీ నయనతారకు ఎదురుదెబ్బలే. మరో విషయం ఏమిటంటే నయనతార తన భర్త విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఎల్‌ఐసీ చిత్రం నుంచి వైదొలగినట్లు తాజా సమాచారం. ఆమె ఎక్కువ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈమె ఒక చిత్రానికి రూ.10 నుంచి రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఎల్‌ఐసీ చిత్ర నిర్మాత అంత చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment