
ల్లిగా/ తండ్రిగా ప్రమోషన్ పొందాకే పేరెంట్స్ విలువ బాగా అర్థమవుతుంది.

సామాన్యులే కాదు సెలబ్రిటీల విషయంలోనూ అంతే! తనకు కూడా తండ్రయ్యాకే అమ్మానాన్నల విలువ బాగా తెలిసొచ్చిందంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్.

శనివారం విఘ్నేశ్ తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా తల్లితో దిగిన ఫోటో షేర్ చేసిన విక్కీ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు.

నేను నా పిల్లల్ని చూసిన ప్రతిసారి నాలో పొంగే ప్రేమను మాటల్లో వర్ణించలేను.

ఎన్ని ఏండ్లు దాటినా ఈ ప్రేమ ఇలాగే ఉంటుందని తెలుసుకున్నాను.

తల్లిదండ్రులు కూడా మన విషయంలో ప్రతిరోజు ఇలాగే ఫీల్ అవుతారు కదా! పిల్లల్ని వారికి నచ్చినట్లుగా సంతోషంగా ఉండనిద్దామనుకుంటారు.

హ్యాపీ బర్త్‌డే నా మీనా కుమారి. నువ్వు లేకపోతే నేను ఇంతదూరం వచ్చేవాడినే కాదు. లవ్యూ మమ్మీ..

ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

నాకింత మంచి కుటుంబాన్ని, ఎన్నో జ్ఞాపకాలను అందించిన ఆ దేవుడు చాలా మంచివాడు.

ఆయన ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయమ్మా.. అని రాసుకొచ్చాడు. సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్ ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
