Why Nayanthara Not Getting Any Movie Offers After Marriage, Details Inside - Sakshi
Sakshi News home page

Nayantara: పెళ్లి తర్వాత నయనతారకు కలిసిరావడం లేదా? భర్తకు అలా, నయన్‌కు ఇలా!

Published Wed, Mar 1 2023 9:20 AM | Last Updated on Wed, Mar 1 2023 10:17 AM

Why Nayanthara Not Getting Any Movie Offers After Marriage, Details Inside - Sakshi

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు పెళ్లి తర్వాత కలిసిరావడం లేదని అనిపిస్తోందంటున్నారు ఆమె ఫ్యాన్స్‌. సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఆమె గతేడాది ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరుస ఆఫర్లు చేతి నిండా సినిమాలతో దూసుకుపోయిన నయన్‌కు పెళ్లి అనంతరం బ్రేక్‌ పడిందంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా ఆఫర్స్‌ లేకపోవడమే.

చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

ఇంతకి అసలు సంగతి ఏంటంటే.. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటూ.. ఇటీవలే బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేసింది నయన్‌. హిందీలో షారూఖ్‌ ఖాన్‌కి జంటగా నటించిన జవాన్‌ చిత్రం, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న ఇరైవన్‌ చిత్రం షూటింగ్‌ ఇటీవల పూర్తి చేసుకున్నాయి. వీటి విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు తర్వాత చిత్రం ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతోంది.దీనికి కారణం కొత్త చిత్రాలేవీ చేతిలో ఏమీ లేకపోవడమే. అధిక పారితోషికం డిమాండ్‌ చేయడంతో అంగీకరించిన చిత్రాలు సైతం వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నయనతార ఇటీవల నటించిన ఆ తరహా చిత్రాలు నిరాశపరిచాయి. మరో విషయం ఏంటంటే నయనతార ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో రెండు లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు చేయడానికి అంగీకరించారని. అందుకు ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లు చొప్పున రెండు చిత్రాలకు రూ. 20 కోట్లు డిమాండ్‌ చేశారని సమాచారం. అయితే అడ్వాన్స్‌ తీసుకుని రెండేళ్లుగా కాలయాపన చేయడంతో వారు చిత్రాలను నిలిపివేయడమే కాకుండా.. నగదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. 

చదవండి: మృణాల్‌కు పెళ్లి ప్రపోజల్‌.. హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే!

ఇదిలా ఉంటే నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆయన అజిత్‌ కథానాయకుడిగా దర్శకత్వం వహించాల్సిన చిత్రం చేజారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు వీరిద్దరి కెరీర్‌కూ పెద్ద ఎదురుదెబ్బ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇవి ఇలా ఉండగా.. నయన్‌ నటనకు స్వస్తి చెప్పారనే ప్రచారం హోరెత్తుతోంది. దీంతో నయనతారకు టైమ్‌ బాగాలేదా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement