లేడీ సూపర్ స్టార్ అంటే సినీ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అంతలా పేరు సంపాదించుకుంది కోలీవుడ్ భామ నయనతార. దక్షిణాది సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులను అధిగమించి నిలదొక్కుకుంది. టాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమా 'చంద్రముఖి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పూర్తి హీరోయిన్‌గా వెంకటేశ్‌తో కలిసి నటించిన చిత్రం 'లక్ష్మీ'. ఆ సినిమా హిట్ కావడంతో టాలీవుడ్‌లో వరుస అవకాశాలొచ్చాయి.
నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్ అలియాస్. కేరళలోని తిరువల్లాకు చెందిన నయన్ బాల్యమంతా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గడిచింది. సినిమా కథలో ట్విస్ట్‌ల లాగే ఆమె జీవితం కూడా ఎన్నో మలుపులు తిరిగింది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది కోలీవుడ్ తార. ఈ తరం హీరోయిన్లలో దక్షిణాదిన అత్యధిక చిత్రాల్లో నటించిన ఘనత కూడా ఆమెదే. ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కథానాయిక ప్రధాన్యమున్న సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు.
(చదవండి: ఆ హీరోతో తొలిసారి కలిసి నటించనున్న నయనతార)
ప్రేమ-పెళ్లి: ‘నానుమ్ రౌడీ ధాన్’ (2015) అనే సినిమాతో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి ఒక్కటైంది ఈ జంట. ఇటీవలే నయన్ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇవాళ నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. భార్యకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈ పుట్టినరోజు మాకు ఎంతో ప్రత్యేకమైంది. చిరస్మరణీయమైంది. ఎందుకంటే మేం భార్య, భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. అలాగే ఇద్దరు పిల్లలకు తల్లితండ్రులయ్యాం. ఆమె ఆత్మవిశ్వాసం, అంకితభావం, జీవితం పట్ల నిజాయితీ, చిత్తశుద్ధి నుంచి నేను ప్రేరణ పొందా. ఆమెను ఒక తల్లిగా చూడడం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. ప్రస్తుతం తనను మేకప్ వేసుకోకుండా ఇంత అందంగా ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం పిల్లలు ముద్దు పెట్టుకుంటారనే నువ్వు మేకప్ వేసుకోవడం లేదు. నీ ముఖంలో అందం, చిరునవ్వు ఇలాగే శాశ్వతంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. రాబోయే పుట్టినరోజులు మరింత సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. దేవుని అశీర్వాదాలతో మన జీవితం మరింత అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ, ఎప్పటికీ నా ప్రియమైన పొండాయాటి(ముద్దుపేరు), పిల్లలను(ఉయిర్, ఉలగం) ప్రేమిస్తూనే ఉంటా.' అంటూ జీవితంలో గుర్తుండిపోయేలా ప్రత్యేక విషెష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment