Vignesh Shivan Removed From AK62 Than Nayan Approach Vijay Sethupathi - Sakshi
Sakshi News home page

Nayanthara: భర్త కోసం నయన్‌ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్‌ ఇచ్చిన విజయ్‌ సేతుపతి?

Published Tue, Feb 28 2023 8:41 AM | Last Updated on Tue, Feb 28 2023 9:37 AM

Vignesh Shivan Removed From AK62 Than Nayan Approach Vijay Sethupathi - Sakshi

దక్షిణాదిలో లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న నటి నయనతార. జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోనూ పాగా వేసిన సంచలన నటి మరోసారి వార్తల్లో నానుతున్నారు. నయనతార పెళ్లి అయిన తర్వాత పలు సమస్యలను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఆ మధ్య సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమె నటించిన చిత్రాలు ఏమీ ఆశించిన విధంగా విజయాలు సాధించలేదు. ఇక తన భర్త విఘ్నేష్‌ శివన్‌ విషయంలో ఘోర పరాభవం జరిగింది. ఈయన నటుడు అజిత్‌ కథానాయకుడుగా చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు.

దీన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనున్నట్లు ప్రకటన కూడా జరిగింది. ఇక షూటింగ్‌కు వెళ్లడమే ఆలస్యం అన్న తరుణంలో సినిమా కథ నచ్చలేదంటూ ఇటు అజిత్, అటు సంస్థ పేర్కొనడమే కాకుండా చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను తొలగించారు. ఇది దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ కంటే ఆమె భార్య, నటి  నయనతారను బాగా గాయపరచిందనే ప్రచారం వైరల్‌ అయ్యింది. దీనికి కారణం ఈ వ్యవహారంలో ఆమె చేసిన సంధి ప్రయత్నం కూడా విఫలం కావడమే. దీంతో అజిత్‌కు బదులుగా నటుడు విజయ్‌ సేతుపతిని తీసుకొని విఘ్నేష్‌ శివన్‌ చిత్రం చేసేలా నయనతార చక్రం తిప్పిందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది.

అందుకు కారణం కూడా ఉంది. హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా నటుడు విజయ్‌ సేతుపతి తమిళంలో సుందర్‌.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే తాజాగా ఆ చిత్ర కథ నచ్చలేదంటూ సుందర్‌.సి కి హ్యాండ్‌ ఇచ్చారు. అయితే దీని వెనుక నటి నయనతార హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా అజిత్‌ తిరస్కరించిన కథలోనే విజయ్‌ సేతుపతిని నటింపజేస్తూ తన ఈగోను తృప్తి పరచుకుంటోందనే వాదన కూడా వినిపిస్తోంది. కాగా విజయ్‌ సేతుపతి, నయనతార, విఘ్నేష్‌ శివన్‌ కాంబోలో ఇంతకు ముందు నానుమ్‌ రౌడీదాన్, కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్రాలు రూపొందాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement