వివాహానంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన కొత్త దంపతులు నయతార-విఘ్నేశ్ శివన్‌లు వివాదంలో చిక్కుకున్నారు. దర్శనాంతరం ఈ జంట తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో తిరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విఘ్నేశ్ చెప్పులు విడిచి నడిచినా.. నయనతార మాత్రం చెప్పులతోనే మాడ వీధుల్లో తిరిగింది. అంతేకాకుండా శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి అత్యంత సమీపంలోనే వారు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.
చదవండి: తిరుమల మాడ వీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన నయన్
ఇలా తిరుమల పవిత్రతకు నయనతార దంపతులు భంగం కలిగించేలా వ్యవహరించి భక్తులు మనోభావాలు దెబ్బతిసేలా ప్రవర్తించారు. దీంతో ఈ నయనతార దంపతుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన నయనతార దంపతులకు నోటీసులు ఇచ్చినట్లు టీటీడీ పీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు.
చదవండి: మేజర్.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
అంతేకాదు నయనతార దంపతులతో ఫోన్లో మాట్లాడామని, భక్తుల మనోభావాలు దెబ్బతిసినందుకు నయనతార క్షమాపణలు చెప్పారన్నారు. తెలియక చేసిన తప్పుకు మన్నించమని నయనతార-విఘ్నేశ్‌లు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై టీటీడీ ఈఓ, చైర్మన్‌తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నోటీసులపై నయనతార దంపతలు స్పందించిన అనంతరం ఏం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు. ఇక చివరగా సాంప్రదాయాలు ఉన్నత వ్యక్తులే పాటించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment