Nayanthara-Vignesh Shivan First Wedding Pic Out - Sakshi
Sakshi News home page

Nayanthara-Vignesh Shivan Wedding Pic: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేశ్‌

Published Thu, Jun 9 2022 2:53 PM | Last Updated on Thu, Jun 9 2022 5:59 PM

Vignesh Shivan, Nayanthara First Wedding Pic Is Out - Sakshi

తన చిరకాల ప్రేయసిని పెళ్లాడిన విఘ్నేశ్‌ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ తమ పెళ్లి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'నయన్‌, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నే

అవును, ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న లవ్‌ బర్డ్స్‌ విఘ్నేశ్‌ శివన్‌-నయనతార అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. చెన్నైలోని మహాబలిపురంలో గురువారం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు సహా పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహం జరిగింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

తన చిరకాల ప్రేయసిని పెళ్లాడిన విఘ్నేశ్‌ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ తన అర్ధాంగికి నుదుటన ముద్దు పెట్టిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'నయన్‌, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరిగింది' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు చిలకా గోరింకల్లా ఉన్నారు, నిండునూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు.

చదవండి:  గ్రాండ్‌గా నయన్‌-విఘ్నేశ్‌ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement