
స్పెయిన్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్ జంట హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇందుకు ఆ జంట రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వీరి ఒక్క రోజు హోటల్ రూమ్ అద్దె రూ. 2.5 లక్షలట. ఇతర ఖర్చులు అదనం అని టాక్. ఈ జంటకు ఒక ప్రముఖ సంస్థ స్పాన్సర్ చేస్తోందని, ఫలితంగానే విదేశీ విహార యాత్ర చేస్తోందని గుసగుసలు. రీల్ జీవితంలో అందాలార బోతతో అభిమానుల్ని అలరించిన నయనతార నిజ జీవితంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ఆరేళ్లకు పైగా ప్రేమ, సహజీవనం చేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు రెండు నెలల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఈ పెళ్లి తతంగాన్ని ఓ ఓటీటీ సంస్థకి ప్రచార హక్కులను అమ్మేసి పెద్ద మొత్తంలోనే సంపాదించినట్లు తెలిసింది. పెళ్లి తరువాత విహార యాత్రల పేరుతో విదేశాలు చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వారి రొమాంటిక్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈ నవ దంపతులు. దీంతో అవి నెట్టింటలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేనికైనా హద్దంటు ఉంటుందని, మితిమీరితే వెగటు పుడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ చేసింది చాలంటూ నెటిజన్లు నయన్ దంపతులపై ఫైర్ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment