honeymoon trip
-
ఖర్చు లేకుండా నయన్ దంపతుల హనీమూన్ ట్రిప్? ఎలా అంటే..
స్పెయిన్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్ జంట హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇందుకు ఆ జంట రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వీరి ఒక్క రోజు హోటల్ రూమ్ అద్దె రూ. 2.5 లక్షలట. ఇతర ఖర్చులు అదనం అని టాక్. ఈ జంటకు ఒక ప్రముఖ సంస్థ స్పాన్సర్ చేస్తోందని, ఫలితంగానే విదేశీ విహార యాత్ర చేస్తోందని గుసగుసలు. రీల్ జీవితంలో అందాలార బోతతో అభిమానుల్ని అలరించిన నయనతార నిజ జీవితంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ఆరేళ్లకు పైగా ప్రేమ, సహజీవనం చేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు రెండు నెలల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. చదవండి: ‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఈ పెళ్లి తతంగాన్ని ఓ ఓటీటీ సంస్థకి ప్రచార హక్కులను అమ్మేసి పెద్ద మొత్తంలోనే సంపాదించినట్లు తెలిసింది. పెళ్లి తరువాత విహార యాత్రల పేరుతో విదేశాలు చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వారి రొమాంటిక్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈ నవ దంపతులు. దీంతో అవి నెట్టింటలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేనికైనా హద్దంటు ఉంటుందని, మితిమీరితే వెగటు పుడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ చేసింది చాలంటూ నెటిజన్లు నయన్ దంపతులపై ఫైర్ అవుతున్నారు. -
నిహారిక దంపతుల హనీమూన్ ప్లాన్
కొణిదెల వారింటి గారాల పట్టి, నటి నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా హీరోలు హాజరయ్యారు. స్టార్ హీరోలు ఒకేచోట చేరి సందడి చేయడంతో దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి తర్వాత నూతన దంపతులు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ మధ్యే మెట్టినింట్లో అడుగు పెట్టిన నిహా తొలిసారి భర్తతో కలిసి బర్త్‌డే జరుపుకుంది. ‘నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్’ అంటూ నిహారికకు చైతన్య వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: మెట్టినింట్లో నిహారిక ఫస్ట్ బర్త్‌డే.. పార్టీ ఎక్కడంటే) తాజాగా ఈ జంట హనీమూన్‌కు ప్లాన్ చేస్తోందట. సెలబబ్రిటీల ఫేవరెట్ స్పాట్ అయిన మాల్దీవులకు వెళ్లడానికి ఈ దంపతులు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే ఈ హనీమూన్ 2020 చివర్లో ఉంటుందా? కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉంటుందా? అనేది ఈ కొత్త జంట క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఎందరో సెలబ్రిటీలతో పాటు హీరోయిన్ కాజల్ దంపతులు కూడా హనీమూన్‌కు మాల్దీవులు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే చైతన్య హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మెగా ఫ్యామిలీ నుంచే కాక, మెగా అభిమానుల నుంచి కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ లభించనుంది. (చదవండి: మెగా పెళ్ళి సందడి) -
హనీమూన్ వాయిదా వేసుకున్న కాజల్..
ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ముంబైలోని ఓ హోటల్లో శుక్రవారం వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు వేశారు. కోవిడ్ నేపథ్యంలో అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. దీంతో సినీ ఇండస్ట్రీ, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ‘చందమామ’కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గౌతమ్‌తో జీవితాంత సంతోషంగా గడపాలని కోరుకుంటున్నారు. కాగా పెళ్లి అనంతరం కేవలం రెండు వారాలు మాత్రమే బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమా షూటింగ్లో కాజల్ పాల్గొననున్నారు. చదవండి: కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్... ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫిమేల్ లీడ్‌లో కాజల్ నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్లో కాజల్ మరో 15 రోజుల్లో తిరిగి జాయిన్ కానున్నారు. ఇదిలా ఉండగా కాజల్ హనీమూన్ టాపిక్ తాజాగా తెర మీదకు వచ్చింది. అయితే ఇప్పట్లో కాజల్-గౌతమ్ హనీమూన్‌కు వెళ్లలనే ఆసక్తి లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆచార్య షూటింగ్గే కారణం అట. ఈ సినిమా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం హనీమూన్ ట్రిప్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పిన తర్వాత డిసెంబర్లో హనీమూన్‌కు ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు కాజల్ ఆచార్య సినిమాతో పాటు కమల్ హాసన్ ’ఇండియన్ 2’, మంచు విష్ణుతో కలిసి ‘మొసగాళ్లు’లో కనిపించనున్నారు. చదవండి: మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులు: నటి -
రైలు మొత్తానికి వారిద్దరే..!
ఉదకమండలం (ఊటి) : లాహిరి లాహిరి లాహిరిలో.. ఓహో జగమే ఊగెనుగా.. తూగెనుగా అన్నట్టు సాగింది యూకేకు చెందిన గ్రాహం విలియం లిన్, సిల్వియా ప్లాసిక్ హనీమూన్ ట్రిప్. యునెస్కో గుర్తింపు పొందిన తమిళనాడులోని నీలగిరి పర్వతాల అందాలను ఈ జంట ప్రత్యేక రైలు (చార్టర్డ్ సర్వీసెస్)లో వీక్షించింది. 2.5 లక్షల రూపాయలు చెల్లించి ప్రత్యేక రైలులో.. ప్రత్యేక ప్రయాణం చేసిన ఇంగ్లిస్ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రసిద్ద నీలగిరి పర్వతాల పర్యటన కోసం దక్షిణ రైల్వే ‘నీలగిరి మౌంటేన్ రైల్వే’పేరిట చార్టర్డ్ రైల్వే సర్వీసులను నడుపుతుండేది. అయితే, 1997లో మొదలైన ఈ సర్వీసులు 2004లో ఆగిపోయాయి. అధునాతన కోచ్‌లు, లోకోమోటివ్స్‌ను అందుబాటులోకి తెచ్చి రైల్వే శాఖ నీలగిరి మౌంటేన్ సర్వీసులను ఈ శుక్రవారం మళ్లీ పునఃప్రారంభించింది. లక్కీగా యూకే దంపతులు విలియం, సిల్వియాకు నీలగిరి మౌంటేన్ సర్వీసుల మొదటి ట్రిప్‌లో ప్రయాణించే అవకాశం వచ్చింది. దాంతో మూడు కోచ్‌ల ప్రత్యేక చార్టర్డ్‌లో.. పచ్చని ప్రకృతి నెలవైన నీలగిరి అందాలను ఆస్వాదిస్తూ.. 13 సొరంగాల గుండా పయనించి తమ జీవితంలో మరపురాని సంతోషాల్ని సొంతం చేసుకున్నారు. 143 సీట్ల సామర్థ్యం గల రైలు మొత్తాన్ని అద్దెకు తీసుకుని ఈ యూకే జంట హనీమూన్ ట్రిప్‌ను గ్రాండ్‌గా డిజైన్ చేసుకుంది. మెట్టుపాలెం నుంచి ఊటి వరకు 48 కిలోమీటర్లు సాగిన ఈ ప్రయాణం అయిదున్నర గంటల పాటు కొనసాగింది. -
పాకెట్ మనీతో చెబితేనే పేమెంట్ విలువ తెలిసేది
కల్యాణ్‌కు ఉద్యోగం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తవుతుండగానే... క్యాంపస్‌లోనే ఓ బహుళజాతి సంస్థ తనను సెలక్ట్ చేసుకుంది. ఆరంభంలో నెలకు రూ.25 వేల జీతం. రెండేళ్లు తిరిగేసరికల్లా జీతం రూ.50 వేలు దాటిపోయింది. ఐదేళ్లు తిరిగేసరికి ఇంట్లో వాళ్లు పెళ్లి కూడా కుదిర్చేశారు. ‘‘పెళ్లయ్యాక ఇంట్లో చక్కని సామగ్రి, హనీమూన్ ట్రిప్... అన్నిటికీ నీ సేవింగ్స్ పనికొస్తాయిరా’’ అన్నాడు కల్యాణ్ తండ్రి. తెల్లమొహం వేశాడు కల్యాణ్. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచీ పైసా దాస్తే ఒట్టు. జీతం పెరిగితే ఖర్చులూ పెరిగాయి. అంతెందుకు! చదువుకునేటపుడు సైతం పాకెట్ మనీ అయిపోయి మళ్లీ మళ్లీ ఇంట్లోవాళ్లనే అడిగేవాడు కల్యాణ్. ఇదంతా ఎందుకంటే... చిన్నప్పటి నుంచే కళ్యాణ్‌కు పొదుపు చేయటం అనే అలవాటుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పటానికే. అది అలవాటు కావాలంటే నేర్పించాల్సింది తల్లిదండ్రులే. అదెలాగో ఈ వారం చూద్దాం... పాత సలహానే అనిపించినా.. ముందుగా పిల్లలకంటూ పిగ్గీ బ్యాంక్ లాంటిది ఒకటి అలవాటు చేయండి. దాని ప్రయోజనాలేంటో వివరించండి. వాళ్లేదైనా మంచి పని చేస్తే చిన్నపాటి పారితోషికం ఇవ్వడంతో పాటు దాన్ని వారు దాచుకునేలా ప్రోత్సహించండి. దీని వల్ల పొదుపు చేయడం అన్నది చిన్నతనంలోనే అలవాటవుతుంది. పిల్లలకు ప్రతి నెలా పాకెట్ మనీ లాంటిది ఇచ్చినప్పుడు అది మొత్తం ఖర్చు చేసేయకుండా.. కొంతైనా దాచుకునేలా ప్రోత్సహించండి. అలా జమ చేసిన డబ్బుతో వారికి నచ్చినవి కొని గిఫ్టుగా ఇవ్వండి. కొంత కొంతగా పొదుపు చేసిన డబ్బుతో పెద్ద అవసరాలను ఎలా తీర్చుకోవచ్చో దీని వల్ల వారికి తెలియజేయొచ్చు. వస్తువులు కొనుక్కురావడం వంటి డబ్బుతో ముడిపడి ఉన్న చిన్న చిన్న పనుల్ని అప్పుడప్పుడు వారికి పురమాయించండి. మొదట్లో తప్పులు చేయొచ్చు. కానీ ఓర్పుగా వివరిస్తే వారు ఆర్థిక లావాదేవీల గురించి త్వరగానే తెలుసుకుంటారు. అప్పుడప్పుడు బ్యాంకులకూ, ఏటీఎంలకూ వెంట తీసుకెళ్లండి. చెక్కులు వేయడం, డబ్బు డిపాజిట్ చేయడం, విత్‌డ్రా చేయడం లాంటి లావాదేవీల గురించి వారు తెలుసుకునే వీలుంటుంది. వీలయితే పిల్లల పేరుతో బ్యాంకు అకౌంటు కూడా తెరవచ్చు. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి కిడ్స్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. కిడ్స్ ఖాతా తెరవాలంటే... పద్దెనిమిదేళ్ల దాకా వయసుండే పిల్లల తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవొచ్చు. సేవింగ్స్ ఖాతా తరహాలోనే ఈ అకౌంట్లకు కూడా అన్ని సదుపాయాలూ ఉంటాయి. డెబిట్ కార్డు, పాస్ బుక్ లాంటి వాటితో పాటు కొన్ని బ్యాంకులు మైనర్ల కోసం చెక్ బుక్‌లు కూడా ఇస్తున్నాయి. ఖాతా తెరిచేందుకు వయసు, చిరునామాతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు పిల్లలకు మధ్య బంధాన్ని తెలియజేసే పత్రాలు, మైనర్ ఫోటో కావాల్సి ఉంటుంది. .. కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు బీమా కవరేజి కూడా ఇస్తున్నాయి. పేరెంట్స్‌కి ఏదైనా అనుకోనిది జరిగిన పక్షంలో బీమా సొమ్ము పిల్లలకు అందుతుంది. మిగతా ఖాతాల్లానే కిడ్స్ అకౌంట్లలోనూ కనీస బ్యాలెన్స్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏమేం ఖాతాలున్నాయంటే... ఐసీఐసీఐ యంగ్ స్టార్స్ 1 రోజు నుంచి 18 ఏళ్ల దాకా వయసున్న వారికి సగటున కనీస బ్యాలెన్స్ రూ. 2,500 ఉండాలి. పర్సనలైజ్డ్ చెక్ బుక్, ఉచిత డెబిట్ కార్డు రోజువారీ రూ.5,000 వ్యయం లేదా విత్‌డ్రాయల్ పేరెంట్స్‌కి ఐసీఐసీఐలో ఖాతా తప్పనిసరి. హెచ్డీఎఫ్సీ కిడ్స్ అడ్వాంటేజీ ఖాతాలో రూ. 35,000 దాటాక.. ఎఫ్డీ కింద ఆటోమేటిక్‌గా మార్చుకునే మనీ మ్యాగ్జిమైజర్ సదుపాయం. ఈ ఖాతా నుంచి పిల్లల పేరిట సిప్‌తో ఫండ్స్‌లోకి మళ్లించవచ్చు కూడా. తల్లిదండ్రులకు ఏదైనా జరిగిన పక్షంలో పిల్లల చదువుకు రూ.1,00,000 ఉచిత విద్యా బీమా. ఆంధ్రా ఏబీ కిడ్డీ 18 ఏళ్ల దాకా వయసున్న వారికోసం పొదుపు అలవాటును పెంచేందుకు ఖాతా తెరిచే సమయంలో పిల్లలకు ఉచితంగా ఒక బొమ్మ కిడ్డీ బ్యాంకును అందిస్తోంది. పిల్లలు దీన్లో డబ్బులు దాచుకోవచ్చు. దీనికి ఒక సీక్రెట్ లాక్ ఉంటుంది. ఖాతా ఉన్న శాఖలోనే ఈ లాక్‌ని తీయడానికి వీలవుతుంది. కనీస బ్యాలెన్స్ రూ. 100. యాక్సిస్ ఫ్యూచర్ స్టార్స్ 12 ఏళ్లకు లోబడి ఉంటే తల్లిదండ్రులు లేదా గార్డియన్ల పేరిట చెక్ బుక్, ఏటీఎం కార్డు మెట్రో నగరాల్లో కనీస త్రైమాసిక బ్యాలెన్స్ రూ. 2,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000. 6 నెలలకు రూ.25,000 ఎఫ్డీ, రూ.2,000 ఆర్డీ చేస్తే మినిమమ్ బ్యాలెన్స్‌లో సడలింపు 12 ఏళ్లు పైబడిన పిల్లలైతే.. వారు కోరుకున్న బొమ్మను డెబిట్ కార్డుపై ముద్రించి ఇస్తారు