Nayanthara Wedding Gift To Vignesh Shivan is a Rs 20 Crore Bungalow - Sakshi
Sakshi News home page

Nayanthara: భర్తకు నయన్‌ రూ.20 కోట్లు విలువ చేసే గిఫ్ట్‌, మరి విఘ్నేశ్‌ ఏమిచ్చాడో తెలుసా?

Published Sat, Jun 11 2022 6:04 PM | Last Updated on Sat, Jun 11 2022 7:22 PM

Nayanthara Special Gift For Husband Vignesh Shivan - Sakshi

అందమైన ప్రేమకావ్యాన్ని పెళ్లితో పదిలపరుచుకున్నారు నయనతార, విఘ్నేశ్‌. చెన్నైలో జూన్‌ 9న వేదమంత్రాల సాక్షిగా వీరు వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని వారు మాత్రమే కాకుండా అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. అందుకోసం అన్నిదానాల్లో కన్నా గొప్పదైన అన్నదానాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు, వృద్ధులకు, అనాధలకు, చిన్నారులకు విందుభోజనం వడ్డించారు. సుమారు లక్షమందికి భోజనం అందించారు. వీరు చేసిన మంచి పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉంటే పెళ్లయిందో లేదో అప్పుడే నయనతార తన భర్తకు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చేందుకు రెడీ అయిందట. ఓ కొత్త బంగ్లాను విఘ్నేశ్‌ పేరు మీద రాసిపెట్టిందట. దీని విలువ అక్షరాలా రూ.20 కోట్లని సమాచారం. అటు విఘ్నేశ్‌ కూడా నయన్‌ పెళ్లిలో సింగారించుకునేందుకు దాదాపు మూడు కోట్ల విలువైన బంగారం కొన్నాడట. దీంతోపాటు రూ.5 కోట్లు విలువ చేసే డైమండ్‌ రింగ్‌ కూడా ఆమె చేతికి తొడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లికి వచ్చిన బంధువులు సైతం నూతన వధూవరులకు కళ్లు చెదిరే బహుమతులిచ్చినట్లు వినికిడి.

చదవండి: కేరింత నటి సుకృతి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు వైరల్‌
మేజర్‌.. పాన్‌ ఇండియా చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు.. కానీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement