Nayanthara And Vignesh Shivan Enjoy Honeymoon In Thailand - Sakshi
Sakshi News home page

Nayanthara-Vignesh Shivan: హనీమూన్‌కు చెక్కేసిన నయనతార దంపతులు

Published Mon, Jun 20 2022 4:02 PM | Last Updated on Mon, Jun 20 2022 5:59 PM

Nayanthara, Vignesh Shivan Went Thailand for Honeymoon - Sakshi

కోలీవుడ్‌ ప్రేమ జంట నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్‌ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నూతన దంపతులు దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల క్షేత్రానికి సైతం వెళ్లి వచ్చారు. అంతేకాదు, తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు భోజనాలు అందించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంట హనీమూన్‌కు చెక్కేసింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఓ లగ్జరీ హోటల్‌లో దిగారు నయన్‌ దంపతులు. దీనికి సంబంధించిన ఫొటోలను విక్కీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. అలాగే వీరు విమానంలో ప్రయాణించే సమయంలో వారితో కలిసి ఓ అభిమాని సెల్ఫీ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇద్దరూ మళ్లీ సినిమాల్లో బిజీ అయితే క్షణం తీరిక దొరకదు కాబట్టి ఇప్పుడే జ్ఞాపకాలను కూడబెట్టుకోండి అని సలహా ఇస్తున్నారు అభిమానులు.

చదవండి:  తాప్సీ 'శభాష్ మిథూ' ట్రైలర్ రిలీజ్‌.. ఆసక్తిగా, ఎమోషనల్‌గా..
ఆ నటితో సీనియర్‌ హీరో నరేష్‌ పెళ్లి ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement